In Pics: చీరల షాపులో చంద్రబాబు, భార్య కోసం ఏరికోరి రెండు చీరలు కొనుగోలు - ఫోటోలు
విజయవాడ మేరీస్ స్టెల్లా కళాశాలలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేనేత కార్మికులతో సీఎం మాట్లాడారు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తులు పరిశీలించారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు తన భార్య నారా భువనేశ్వరి కోసం రెండు చేనేత చీరలు కొన్నారు. ఆ చీరలకు అయిన సొమ్మును స్టాల్ నిర్వాహకులకు అందజేశారు.
చేనేత చీరల ప్రత్యేకతల గురించి చంద్రబాబు తయారీదారులను అడిగి తెలుసుకున్నారు. భువనేశ్వరి కోసం వెంకటగిరి చీర, ఉప్పాడ జాందాని చీరలను సీఎం కొన్నారు.
‘‘గత ప్రభుత్వం నేతన్నని చిదిమేసింది. త్రిఫ్ట్ ఫండ్ ఆపేసారు, నూలు సబ్సిడీ ఆపేసారు, జీఎస్టీ భారం పడింది, రిబేట్ ఎత్తేసారు. సొసైటీలకు పావలా వడ్డీ రుణాలు వచ్చేవి అవి ఆపేసారు. యార్న్ సబ్సిడీ ఆపేసారు’’ అని తమ సమస్యలను చేనేత కార్మికులు చెప్పుకున్నారు.
గత 5 ఏళ్ళ జగన్ రెడ్డి ప్రభుత్వంలో, చేనేత కోసం మీరు గతంలో తెచ్చిన 24 పధకాలు రద్దు చేశారని వివరించారు.
‘‘నేతన్నల కోసం రూ.70 కోట్ల వరకు జీఎస్టీ రీయింబర్స్ చేస్తాం. గ్రూపుగా మగ్గం పెట్టుకోవటానికి స్థలం ఇస్తాం. ఇల్లు లేకపోతే చేనేత కార్మికులకు, మగ్గాలు ఏర్పాటు చేసుకోవటానికి రూ.4.30 లక్షలకు అదనంగా మరో రూ.50 వేలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తాం’’ అని చంద్రబాబు హామీలు ఇచ్చారు.