Ileana Son: ఇలియాన కొడుకు ఫస్ట్ బర్త్‌డే ఫోటోలు చూశారా? - అప్పుడే ఏడాది అయ్యిందా.. ఫ్యాన్స్ రియాక్షన్!
Ileana Son Birthday Photos: బెల్లీ బ్యూటీ ఇలియాన తన కొడుకు కోవా ఫీనిక్స్ డోలన్ ఫస్ట్ బర్త్‌డే ఫోటోలు షేర్ చేసింది. గతేడాది ఇలియాన పండంటి మగబిడ్డకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ విషయాన్ని ఆలస్యంగా ప్రకటిస్తూ బాబుకి కోవా ఫీనిక్స్ డోలన్ అని పేరు పెట్టినట్టు చెప్పింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఇల్లీ బేబీ గర్భవతిని అంటూ బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి షాకిచ్చింది.
ఆ తర్వాత కొద్ది రోజులకే మగబిడ్డ పుట్టాడని వెల్లడించింది. అయితే నేటితో ఫీనిక్స్ పట్టి ఏడాది అవుతుంది. ఈ రోజు కోవా ఫోనిక్స్ డోలన్ ఫస్ట్ బర్త్‌డే. ఈ సందర్భగా తొలిసారి కొడుకు ఫేస్ రివీల్ చేసింది ఇల్లీ బేబీ.
ఈ సందర్భంగా ఫినిక్స్ సంబంధించిన రేర్ పిక్స్, అతడు చేస్తున్న అల్లరి ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఇలియాన కొడుకుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక ఫీనిక్స్ డోలన్ చూసి నెటిజన్లంతా చాలా క్యూట్ ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఫీనిక్స్‌కి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాదు ఫీనిక్స్ పుట్టి అప్పుడే ఏడాది అవుతుందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇలియాన పెళ్లి కబురు చెప్పకుండానే తన ప్రెగ్నెన్సీ న్యూస్‌ను షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నెటిజన్లంతా ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు.
బిడ్డ తండ్రి ఎవరంటూ ఇలియానను ప్రశ్నిస్తూ ఆమెను ఇబ్బంది పెట్టారు. ఇక కొడుకు పుట్టిన విషయాన్ని ప్రకటిస్తూ అదే రోజు తన భర్త మైఖేల్‌ను పరిచయం చేసి ట్రోలర్స్ నోరు మూయించింది ఈ గోవా బ్యూటీ.