Gaddar Last Movie: గద్దర్ లాస్ట్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ - ఈ నెలలోనే థియేటర్లలోకి 'ఉక్కు సత్యాగ్రహం'
'విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు' అనే నినాదంతో తెరకెక్కిన సినిమా 'ఉక్కు సత్యాగ్రహం'. ఇందులో ప్రజా యుద్ధ నౌక, విప్లవ కవి గద్దర్ ఓ కీలక పాత్రలో నటించారు. ఆయన ఆఖరి చిత్రమిది. పి సత్యారెడ్డి దర్శక నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. హీరోగానూ సత్యారెడ్డి నటించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
Ukku Satyagraham Movie Release Date Locked: 'ఉక్కు సత్యాగ్రహం' సినిమాలో పల్సర్ బైక్ ఫేమ్, విశాఖ కండక్టర్ ఝాన్సీ కీలక పాత్ర చేశారు. ఈ సినిమాను ఈ నెల 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాత పి సత్యారెడ్డి చెప్పలేదు.
ప్రముఖ దర్శక నిర్మాత బి. నర్సింగ రావు, తెలంగాణ రాష్ట్ర గీతం రూపశిల్పి అందే శ్రీ, గద్దర్ తనయుడు సూర్యం, జానపద కవి గోరటి వెంకన్న, ప్రొఫెసర్ కోదండరాం, నందిని సిద్ధారెడ్డి, అల్లం నారాయణ వంటి ప్రముఖులు 'ఉక్కు సత్యాగ్రహం' రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు.
'ఉక్కు సత్యాగ్రహం' సినిమాలో గద్దర్ మూడు పాటలు పాడారు. అలాగే, రెండు పాటల్లో, కొన్ని సందేశాత్మక సన్నివేశాల్లో నటించారు.
'ఉక్కు సత్యాగ్రహం' విడుదల తేదీ ప్రకటించిన సందర్బంగా దర్శక నిర్మాత, హీరో పి సత్యారెడ్డి మాట్లాడుతూ... ''విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అక్కడ భూనిర్వసితులకు న్యాయం జరగాలని మూడేళ్లు కష్టపడి తెరకెక్కించిన సినిమా 'ఉక్కు సత్యాగ్రహం'. స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు, ఉద్యోగులు, ఎంతో మంది మేధావులు, భూనిర్వాసితులు, కవులు కళాకారుల, రచయితలు ఈ సినిమాలో నటించారు. 200కు పైగా థియేటర్లలో విడుదల చేయనున్నాం'' అని చెప్పాం.
Ukku Satyagraham Movie Cast And Crew: గద్దర్, సత్యా రెడ్డి, 'పల్సర్ బైక్' ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ, ఎంవీవీ సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ కోటి, కూర్పు: మేనగ శ్రీను, కథ - కథనం - నిర్మాణం - దర్శకత్వం: పి. సత్యా రెడ్డి.