Samantha: సమంత సూపర్ హిట్ తమిళ్ సినిమా - తెలుగులో 400లకు పైగా థియేటర్లలో ఈ వారమే విడుదల
Vijay Sethupathi's Super Deluxe Releasing On August 9th 2024 In Telugu: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన సూపర్ హిట్ తమిళ్ ఫిల్మ్ 'సూపర్ డీలక్స్'. ఇందులో ఆయన లేడీ రోల్ చేశారు. తెలుగులో ఈ సినిమాను ఆగస్టు 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'సూపర్ డీలక్స్' సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత సైతం నటించారు. తమిళంలో ఈ సినిమా విడుదలై ఐదేళ్లు దాటింది. మాస్టర్ పీస్ అని క్రిటిక్స్ ప్రశంసలు సైతం అందుకుంది. ఇప్పుడీ సినిమా ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల కానుండటం విశేషం.
'సూపర్ డీలక్స్' స్పెషాలిటీ ఏమిటంటే... ఈ సినిమా తెలుగు వెర్షన్ ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే... థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వేరు కదా! సో... ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
త్యాగరాజ కుమార రాజా దర్శకత్వంలో దైవ సెల్వి తీర్థం ఫిలిమ్స్ పతాకంపై దైవ సిగమణి, తీర్థ మలై, పూల మధు నిర్మాతలుగా 'సూపర్ డీలక్స్' తెరకెక్కింది. 'పుష్ప' ఫేమ్ ఫహాద్ ఫాజిల్, రమ్యకృష్ణ, మిస్కిన్, గాయత్రి, భగవతి పెరుమాళ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
'సూపర్ డీలక్స్' సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా... పి.ఎస్. వినోద్, నీరవ్ షా ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగు విభిన్న కథలతో తెరకెక్కిన చిత్రమిది.