Party For Pushpa Team: బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో 'పుష్ప' టీం కోసం స్పెషల్ పార్టీ - 'పుష్పరాజ్' సందడి చూశారా?
Pushpa Team At Berlin Film Festival: ప్రస్తుతం 'పుష్ప: ది రైజ్' మేనియా ఇంటర్నేషనల్ లెవల్‌కు వెళ్లింది. ఇప్పుడీ సినిమా ప్రతిష్ఠాత్మక బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు కూడా వెళ్లింది. ఐకాన్ స్టార్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది ఈ మూవీ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదీంతో ఆయనకు ప్రస్తుతం జరుగుతున్న బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ప్రత్యేక ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఆయన ఇండియా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా పుష్ప: ది రైజ్‌ను ఇదే వేదికపై ప్రదర్శించబోతున్నారు.
ఈ నేపథ్యంలో పుష్ప టీం కోసం ప్రత్యేకంగా అక్కడ గ్రాండ్‌ని పార్టీని నిర్వహించారు. ఈ సందర్భంగా నిన్న సాయంత్రం అక్కడ అల్లు అర్జున్‌తో పాటు మూవీ నిర్మాతలు ఇతర మూవీ టీం సభ్యులు పార్టీలో సందడి చేశారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ మీడియా, పిలిం సర్కిల్స్‌తో అల్లు అర్జున్ ఇతర పుష్ప టీం సభ్యులు ఈ పార్టీలో సందడి చేశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా పుష్ప మూవీ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో ఇవి వైరల్‌గా మారాయి.అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప: ది రైజ్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో బన్నీ నేషనల్ స్టార్ అయిపోయాడు.
అంతేకాదు ఈ మూవీకి గానూ రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డును కూడా అందుకుని రికార్డు సృష్టించాడు. ఇప్పుడు బెర్లిన్ ఇంటర్నేషన్ ఫిలిం ఫెస్టివల్ ఆహ్వానం అందుకుని మరో అరుదైన గౌరవం పొందారు. బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న అల్లు అర్జున్ అక్కడ ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌తో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వేడుకలో ‘పుష్ప’ సినిమాను పదర్శించనున్నట్లు తెలిపారు. విదేశీ ప్రేక్షకులు ‘పుష్ప’ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఉందన్నారు. భారతీయ సినిమాను వాళ్లు ఏ కోణంలో చూస్తారో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఫిలిం ఫెస్టివల్ కు వచ్చినట్లు వివరించారు.
ఈ సందర్భంగా ఓ హాలీవుడ్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘పుష్ప’ సినిమాతో పోల్చితే ‘పుష్ప 2’లో తన షేడ్స్ చాలా భిన్నంగా ఉంటాయని చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలిపారు.
పుష్పరాజ్ స్కేల్, క్యారెక్టరైజేషన్, కాన్వాస్, ప్రెజెంటేషన్ పెద్ద రేంజిలో ఉంటుందన్నారు. ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్ ప్రాంతీయ స్థాయిలో తన కార్యకలాపాలు కొనసాగిస్తే, పార్ట్ 2 లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ఉండబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో పుష్పరాజ్, భన్వర్ సింగ్ షెకావత్ గొడవ తీవ్రస్థాయికి వెళ్లనున్నట్లు చెప్పారు.
బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో పుష్ప మూవీ స్క్రీనింగ్