Honey Rose: అందాల హనీకి దిష్టి తీయాల్సిందే - చీరలో అదుర్స్ అంతే!
Honey Rose: హనీ రోజ్‌కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒక్క సినిమాతో రాత్రికిరాత్రే స్టార్డమ్ అందుకుంది. చేసింది మదర్ రోలే అయినా స్టార్ హీరోయిన్ రేంజ్లో ఫాలోయింగ్ సంపాదించుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగతేడాది బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మూవీతో తెలుగు ఆడియన్స్‌కు చేరువైంది ఈ ముద్దుగుమ్మ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ మరదలిగా నటించి మెప్పించింది. ఈ సినిమాలో అందంతోనే కాదు అభినయంతోనూ ఆకట్టుకుంది.
ఈ సినిమా ఘన విజయం సాధించడంతో హనీ రోజ్ టాలీవుడ్ సెన్సేషన్ అయిపోయింది. ఆమె గ్లామర్, బ్యూటీకి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు నెట్టింట విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది.
రీలీజ్ తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆమె వీడియోలే. ఈ దెబ్బతో ఆమె టాలీవుడ్లో ఫుల్ బిజీ అయిపోతుందని అనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. సోషల్ మీడియా, షాపింగ్స్ మాల్స్ ఒపెనింగ్స్ తప్పితే ఈ బ్యూటీ స్క్రీన్‌పై కనిపించింది లేదు.
ఆమె జోరు, సందడి అంతా సోషల్ మీడియాకే పరిమితమైంది. ఈ క్రమంలో హనీ రోజ్ తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట యమ క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా సిల్కి చీరలో ఈ బ్యూటీ కనువిందు చేసింది. స్టీవ్‌లెస్ బ్లౌజ్, ఉల్లిపోర లాంటి పలుచటి సిల్క్ చీరలో అందాలు ఒలకబోసింది.
తాజాగా వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. లేత గులాబి రంగు లాంటి ఆమె స్కిన్ కలర్‌కు ఈ పర్పుల్ కలర్ శారీలో హనీ రోజ్ మరింత ఆకట్టుకుంటోంది. దీంతో శారీ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.