Kajal Aggarwal: ట్రెండీ లుక్‌లో ఫిదా చేస్తున్న కాజల్ - గ్లామర్ డోస్ మరింత పెంచేసిందిగా
Kajal Aggarwal: ఒకప్పుడు సౌత్ లో ఓ వెలుగు వెలిగిన అందాల చందమామ కాజల్ అగర్వాల్..రీసెంట్ గా బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీలో నటించింది. త్వరలో మరో మూవీలో బాలయ్య సరసన నటించబోతోందని టాక్.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమూడేళ్ల క్రితం పెళ్లిచేసుకున్న కాజల్ ఆ తర్వాత సినిమాలను తగ్గించింది. లాంగ్ బ్రేక్ ఇచ్చిన ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇక ఈ మధ్యే బాలయ్య సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో సత్యభామ మూవీ చేస్తోంది కాజల్.
ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ కనిపించబోతున్నది. మరోవైపు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా బ్లాక్ కాలర్ ఏ లైన్ షర్ట్ ప్యాంటులో ట్రెండీ లుక్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె బ్లాక్ డ్రెస్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ట్రెండీ లుక్‌తో కాజల్ ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అందం ఏమాత్రం తరగలేదని, ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తోందంటు నెటిజన్లు ఆమె ఫొటోలపై స్పందిస్తున్నారు.
కాగా డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన లక్ష్మీ కల్యాణం మూవీతో కాజల్ టాలీవుడ్‌కు పరిచయమైంది. 2007లో వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేదు. కానీ కాజల్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
దాంతో ఆ వెంటనే చందమామ సినిమా చేసింది. ఇది కూడా కాజల్‌కు మంచి గుర్తింపే ఇచ్చింది. 2009లో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ దెబ్బకు కాజల్ కు టాలీవుడ్ లో మంచి బ్రేక్ వచ్చి పడింది.
దాంతో స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపిన కాజల్ ఇక బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో హిట్స్, బ్లాక్‌బస్టర్స్ అందుకుంది. అల్లు అర్జున్ ఆర్య, ప్రభాస్‌తో 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్' ఆమె కెరీర్లో బెస్ట్ మూవీస్‌గా నిలిచాయి.