Kiran Abbavaram and Rahasya Engaged : ఆరేళ్ల రిలేషన్‌ను బయటపెట్టిన రహస్య.. కిరణ్ అబ్బవరంతో తన లవ్ జర్నీ అలా మొదలైందంటూ ఎమోషనల్
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం.. హీరోయిన్ రహస్య గోరఖ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు సమీప బంధువులు చెప్తున్నారు. (Images Source : Instagram/kiran_abbavaram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ఇద్దరూ.. రాజావారు రాణివారు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఫీల్ గుడ్ సినిమాతో ఇద్దరూ సక్సెస్‌ను రుచి చూసి కెరీర్‌ను ప్రారంభించారు. (Images Source : Instagram/kiran_abbavaram)
వీరిద్దరూ రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను ఇద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా అభిమానులకు షేర్ చేశారు.(Images Source : Instagram/kiran_abbavaram)
ఈ నేపథ్యంలోనే హీరోయిన్ రహస్య.. తమ ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇన్‌స్టా స్టోరీలో వెల్లడించింది. రాజావారిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తున్న ఆ స్టోరీ అందరినీ ఆకట్టుకుంటుంది. (Images Source : Instagram/kiran_abbavaram)
ఆరేళ్లుగా నువ్వు నాకు తెలుసు. బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నప్పుడే ప్రేమలో పడ్డాం. 6 years of knowing you, being best of friends, falling in love, endless conversations, comforting silence, unplanned trips, the highs & the lows, it has been the most beautiful journey so far, excited to continue this journey for life with you❤️ Thankyou for always being there for me & the for being mine forever❤️అంటూ తన ప్రేమను వ్యక్తం చేసింది.(Images Source : Instagram/kiran_abbavaram)
ఆరేళ్ల ప్రయాణం తర్వాత వీరు ఇద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో మార్చి 13వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.(Images Source : Instagram/kiran_abbavaram)
కిరణ్ అబ్బవరం మొదటి సినిమా తర్వాత.. వరుసగా పలు సినిమాలు చేశారు. సినిమాల్లోకి రాకముందు పలు షార్ట్ ఫిల్మ్స్ చేశారు. అనంతరం సినిమాల్లోకి రావడం కోసం జాబ్ వదులుకుని వచ్చి మరీ ఇండస్ట్రీలో తన ప్లేస్‌ని సెట్ చేసుకుంటున్నారు.(Images Source : Instagram/kiran_abbavaram)
రహస్య గోరఖ్ రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. దీనిలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి కానీ.. అవకాశాలు రాలేదు. తమిళంలో ఓ సినిమా చేసి సినిమాలకు బ్రేక్ తీసుకుంది. ఈ భామ కూడా షార్ట్ ఫిల్మ్స్‌తోనే కెరీర్ ప్రారంభించింది.(Images Source : Instagram/kiran_abbavaram)