Raashi Khanna Photos: కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న రాశీ ఖన్నా - అందమైన చీరకట్టుతో ఫిదా చేస్తున్న బ్యూటీ
Raashi Khanna Traditional Look: బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా తాజాగా చీరకట్టుతో ఆకట్టుకుంది. గోల్డ్ కలర్ సిల్క్ చీరలో కొత్త పెళ్లి కూతురిలా మెరిసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅందమైన చీరకట్టుతో వయ్యారాలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం రాశీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆమె లేటెస్ట్ లుక్ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కుందనపు బొమ్మలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం తెలుగులో రాశీ ఖన్నా హడావుడి తగ్గిపోతుంది.
మొన్నటివరకు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా అలరించిన ఆమెకు ప్రజెంట్ ఇక్కడ ఆఫర్స్ కరువయ్యాయి. దీంతో బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటూ హావా కొనసాగిస్తుంది.
మొన్నటి వరకు బబ్లీ బ్యూటీగా కుర్రకారు మనసులను దోచుకున్న ఈ బ్యూటీ ఈ మధ్య డైట్ చేసి సన్నబడింది. దాంతో బి-టౌన్లో తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. బాలీవుడ్లో వెబ్ సీరిస్తో కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా సిద్ధార్థ్ మల్హోత్రా సరసనే చాన్స్ కొట్టేసింది.
వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన చిత్రం 'యోధ'. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.