Pathaan Media Meet Pics: ‘పఠాన్’ టీమ్ సక్సెస్ సంబురం
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కీలక పాత్రల్లో నటించిన ‘పఠాన్‘ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ నెల 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొట్టింది.
5 రోజుల్లో రూ. 500 కోట్లు వసూళు చేసి బాలీవుడ్ కు కొత్త ఊపు తీసుకొచ్చింది.
విడుదలైన తొలి రోజునే ఏకంగా రూ. 70 కోట్లకు పైగా వసూళు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
షారుఖ్, దీపిక రా ఆఫీసర్లుగా, జాన్ అబ్రహం విలన్ గా నటించి ఆకట్టుకున్నారు.
ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
పఠాన్ పాటల జోష్ కు థియేటర్ల దద్దరిల్లాయి. ప్రేక్షకులు సీట్లలో నుంచి లేచి డ్యాన్సులు చేశారు.
నార్త్, సౌత్ అనే తేడా లేకుండా, విడుదలైన అన్ని చోట్లా సక్సెస్ ఫుల్ గా మూవీ రన్ అవుతోంది.
ఓవర్సీస్ లోనూ ఓ రేంజిలో సక్సెస్ అందుకుంది.
తాజాగా ఈ సినిమాకు సబంధించి మూవీ యూనిట్ ముంబై లో సక్సెస్ మీట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో షారుఖ్, దీపిక, జాన్ అబ్రహం, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ‘పఠాన్‘ ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు.
అభిమానుల ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకున్నారు.