Nayanthara Photos: ఎల్లో సిల్క్ శారీలో అందంతో కట్టిపడేస్తోన్న లేడీ సూపర్ స్టార్ - అవార్డు వేడుకలో మెరిసిన నయన్
Nayanthara at Dadasaheb Phalke Film Festival: లేడీ సూపర్ స్టార్ నయతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కుర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశబ్దాలు దాటుతున్న ఇప్పటికి స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరోజురోజు నయన్ క్రేజ్ పెరుగుతుంది కానీ తరగడం లేదు. నాలుగు పదుల వయసులోనూ గ్లామర్‌లో యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తుంది. లేడీ ఓరియంటెడ్ పాత్రలు చేస్తూ మరోవైపు గ్లామర్ రోల్స్‌లోనూ ఫిదా చేస్తుంది.
అప్పట్లో నయన్ కెరీర్ అయిపోయిందా? అనుకునే టైంలో మళ్లీ హీరోల సరసన గ్లామర్ రోల్లో చాన్స్ అందుకుంటూ కెరీర్‌ను గాడిలో పడేసుకుంది. పెళ్లి తర్వాత ఇక సినిమాలు తగ్గుతాయని అనుకుంటే బాలీవుడ్లో ఆఫర్స్ కూడా కొట్టేస్తుంది.
ఇకపోతే తాజాగా నయనతార దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో మెరిసింది. ఎల్లో సిల్క్ శారీలో నయన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ అవార్డులో కరీనా కపూర్ వంటి బాలీవుడ్ స్టార్స్ ఉన్న అందరి కళ్లు నయన్పైనే పడ్డాయి. మూవీ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ వద్ద నయన్ కెమెరాలో ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను ఫిదా చేస్తున్నారు.
ఇదిలా ఉంటే నయనతార ఇటీలవ షారుక్ ఖాన్ 'జవాన్' మూవీలో హీరోయిన్గా నటించి నార్త్ ఆడియన్స్‌కి చేరువైంది. ఇక ఈ సినిమా నయన్ అందానికి నార్త్ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు. దీంతో అక్కడ కూడా ఆమెకు మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.
జవాన్ తర్వాత రీసెంట్గా అన్నపూర్ణి అనే లేడీ ఒరియంటెడ్ సినిమాలో నటించింది. అయితే ఈ చిత్రాన్ని పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఇందులో బ్రహ్మిణి వర్గానికి చెందిన అమ్మాయిలో పాత్రలో కనిపించింది. ఒక బ్రాహ్మణ అమ్మాయి పాత్ర పోషిస్తూ.. మాంసం వండుతుంది.
అలా వంట చేసేముందు తను నమాజ్ కూడా చేస్తుంది. సినిమాలోని ఈ సీన్స్.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని రమేశ్ సోలంకి పేర్కొన్నారు. హీరో జై పాత్ర రాముడిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుల వనవాసంలో మాంసహారం వండుకుని తిన్నారంటూ చెప్పే ఈ సన్నివేశమే సినిమాను వివాదంలోకి నెట్టింది.
దీంతో మూవీని బ్యాన్ చేయాలంటూ హిందూ సంఘాలు నుంచి డిమాండ్స్ వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ కూడా మూవీ రిలీజ్ చేసి ఆ తర్వాత తొలగించింది. ఆ తర్వాత ఎన్నో వివాదాల నడుమ ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యింది.
image 10