Manushi Chhillar: తనకు నచ్చిందే చేస్తానంటోన్న మాజీ విశ్వసుందరి మానుషి చిల్లర్!
మానుషి చిల్లర్ సామ్రాట్ పృథ్వీరాజ్ లో సంయోగిత క్యారెక్టర్ తో నటిగా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో వరుణ్ తేజ్ తో కలసి ఆపరేషన్ వాలెంటైన్ లో కనిపించింది. తెలుగు, హిందీ మూవీస్ లో నటించిన హర్యానీ వయ్యారి కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమానుషి తండ్రి మిత్రా బసు చిల్లార్..డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో ఫిజిషియన్ , సైంటిస్ట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి వైద్యురాలు.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్లో న్యూరోకెమిస్ట్రీ అనుబంధ శాస్త్రాలు విభాగానికి హెడ్.
చదువులో నంబర్ వన్ అయిన మానుషి మిస్ వరల్డ్ 2017 పోటీల్లో విజేతగా నిలిచింది. ఫెమినా మిస్ ఇండియా 2017 పోటీలో ఆమె హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. 17 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకుంది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో డేటింగ్ చేస్తోందనే టాక్ వచ్చింది... జాన్వి ప్రియుడైన శిఖర్ పహారియాకి వీర్ పహారియా సోదరుడు...
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మానుషి ఫొటోస్ షేర్ చేస్తూనే.. కోట్స్ పెడుతుంటుంది...