Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష.. కనకదుర్గ ఆలయంలో మెట్లు కడిగి బొట్లు పెట్టిన ఏపీ డిప్యూటీ సీఎం!
ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడ కనక దుర్గ గుడిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దుర్గగుడి మెట్లను శుద్ధి చేసి..పసుపు రాసి బొట్టు పెట్టి శుద్ధి కార్యక్రమం పూర్తిచేశారు
శుద్ధి కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. గుడికి వెళ్లే ప్రతి హిందువుకి బాధ్యతలేదా? సనాతన ధర్మాన్ని పరిరక్షించడం మీ బాధ్యత కాదా అని ప్రశ్నించారు
ప్రతిసారి కూర్చోబెట్టి డిఫెండ్ చేసుకోలేం అందుకే సనాతన ధర్మ బోర్డు ఉండాలని మేం ప్రతిపాదించాం అన్న పవన్ కళ్యాణ్.. ఇదే వేరే మతంపై దాడి చేస్తే ఎంత మంది రియాక్ట్ అవుతారు. రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయమని చెప్పడం లేదు..కానీ కనీం కోపం రాకపోతే ఎలా అని ప్రశ్నించారు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరగడంతో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు పవన్ కళ్యాణ్. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను అక్టోబరు 02 న విరమిస్తారు
అక్టోబర్ 1వ తేదీన అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకోనుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అక్టోబరు 02న శ్రీ వేంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు.
అక్టోబరు 03 న తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్