Satyabhama Serial Today September 24th: బయటపడిన క్రిష్ గతం .. 'అలవైకుంఠపురములో' ఫాలో అయిపోయారు - సత్యభామ సీరియల్ సెప్టెంబరు 24 ఎపిసోడ్ హైలెట్స్!
క్రిష్ తన కొడుకు కాదు.. మన ప్రాణాలు కాపాడే పెంపుడు కుక్క అన్న మహదేవయ్యమాటలు సత్యకు పదే పదే గుర్తొస్తుంటాయి. డైనింగ్ టేబుల్ దగ్గర అందరికీ భోజనం వడ్డిస్తున్నా సత్య పరధ్యానంలో ఉంటుంది..
మహదేవయ్య పక్కన కూచున్న అన్నదమ్ములను చూసి... నీ ఇద్దరి బిడ్డలే నీకు కుడిభుజం ,ఎడమ భుజం అంటుంది మహదేవయ్య తల్లి. కాదు కాదు నాకు క్రిష్ ఉంటే చాలన్న మాటలు విని సత్య షాక్ అవుతుంది.
నా కళ్లు తెరుచుకున్నాయన్న రుద్ర..బాపూ నాకు నిజాలు చెప్పాడు..ఇన్నాళ్ల నా గుండె భారాన్ని దించేశాడు అంటాడు. అవే నిజాలు చిన్నాకి కూడా చెప్పొచ్చుకదా మావయ్యగారు అంటుంది సత్య.. మహదేవయ్య షాక్ అవుతాడు.. క్రిష్ మాత్రం తండ్రి అనుకుంటున్న మహదేవయ్యను సపోర్ట్ చేస్తాడు
క్రిష్ అసలు తండ్రి ఎంట్రీ ఇవ్వడంతో గతం బయటపడింది.. క్రిష్ ఎవరో కాదు..స్వయంగా మహదేవయ్య తమ్ముడి కొడుకు. మొదట్నుంచీ హత్యారాజకీయాల్లో ఉన్న మహదేవయ్యను చూసి.. తల్లి కంగారుపడుతుంది.. నీ కారణంగా నీ బిడ్డలకు గండం అని హెచ్చరిస్తుంది..
తల్లితో పాటూ పెద్ద కొడుకుని పంపించేసిన మహదేవయ్య..అదే సమయంలో తన తమ్ముడికి పుట్టిన కొడుకుని లాగేసుకుని తీసుకొచ్చి.. తమ్ముడి భార్యను చంపేసి బిడ్డల్ని మార్చేస్తాడు
అలవైకుంఠపురములో మూవీలో మురళీశర్మ తన కొడుకు రాజులా పెరగాలని భావించి గొప్పింటికి ...గొప్పింట్లో పెరగాల్సిన బిడ్డను తనింటికి తెచ్చుకుంటాడు. అలా మహదేవయ్య తన కొడుకు సేఫ్ గా ఉండేందుకు తమ్ముడి చేతిలో పెట్టి...తనకు కాపలా కుక్కలా పెంచేందుకు తమ్ముడి బిడ్డను తీసుకెళ్లిపోతాడు.
నీ కొడుకుని అద్భుతంగా పెంచాను...ప్రయోజకుడుని చేశాను..కానీ నా కొడుకుని నువ్వు నీలా రౌడీలా తయారు చేశావ్ అని ఫైర్ అవుతాడు మహదేవయ్య తమ్ముడు. ఇలా చేస్తుంటే చూస్తూ ఊరుకోను అన్న తమ్ముడిని రివర్స్ లో బెదిరిస్తాడు మహదేవయ్య...
తన రాజకీ భవిష్యత్ కోసం అడ్డుతగులుతున్న ఓ వ్యక్తిని చంపేసి రమ్మని క్రిష్ ని పంపిస్తాడు మహదేవయ్య.. నువ్వు వెళ్లడానికి వీల్లేదంటూ అడ్డుకుంటుంది సత్య....ఇది సెప్టెంబరు 25 బుధవారం ఎపిసోడ్ లో రాబోతోంది....