Manchu Viranica: మంచు కోడలు విరానికా రాయల్ లుక్- ఆకట్టుకుంటున్న ఫ్యామిలీ ఫోటోలు
Manchu Viranica Instagram: మంచు వారి కోడలు విరానికా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా పరిచయం లేకపోయినా, మంచు విష్ణు సతీమణిగానే అందరికీ సుపరిచితమే.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకానీ, ఆమె అమెరికాలోనే పుట్టి పెరిగింది. ఆభరణాలు, జెమాలజీ, ఫ్యాషన్ మార్కెటింగ్ లో పట్టా అందుకుంది. విష్ణుతో వివాహం తర్వాత భారత్ కు వచ్చింది.
పెళ్లి తర్వాత తన కుటుంబ సభ్యులకు కొత్త డ్రెస్ లు, నగలు తనే డిజైన్ చేసేదట. కొద్ది రోజులుగా భారత్ లో విరానికా అనే పేరుతో బోటిక్ రన్ చేసింది. ప్రస్తుతం లండన్ వేదికగా తన బిజినెస్ ప్రారంభించింది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన లండన్ హోరోడ్స్ లో ఫ్యాషన్ స్టోర్ ప్రారంభించింది. అంతేకాదు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
తరచూ తన ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లు ఫిదా చేస్తుంది. వెరైటీ, ట్రెడీషనల్ డిజైనర్ వేర్లో ఫ్యామిలీ అంతా ఆకట్టుకుంటుంది. ఫ్యాషన్ రంగానికి చెందని ఆమె తన టెస్ట్‌తో పిల్లలకు, భర్తకు స్పెషల్ డిజైనింగ్ చేపిస్తుంది.
పిల్లలు, భర్తతో డిఫరెంట్ ఢిపరెంట్ డ్రెస్సులు, రాయల్ లుక్‌లో ఫొటోలను ఫోజులు ఇస్తుంది. ఇక షేర్ చేసే ఫోటోలకు కోసం ఫాలోవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలా తరచూ రాయల్ లుక్‌లో విరానికా ఫిదా చేస్తుంది.