Mahesh Babu New Look: మహేష్ మరో న్యూలుక్ - ఏంటి ఈ మేకోవర్ అంటున్న ఫ్యాన్స్

Image Credit: urstrulymahesh/Instagram
Mahesh Babu New Look: గత మూడు రోజులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇస్తున్నాడు. వరుసగా తన లేటెస్ట్ లుక్ షేర్ చేస్తున్నాడు. మొన్న లేజర్ ఫోకస్ అంటూ స్టన్నింగ్ లుక్ వదిలాడు.
నిన్న ఆయన భార్య నమ్రత మహేష్ సూట్ లుక్ షేర్ చేసి షాకిచ్చింది. మహేష్ కూడా 'సూటప్' అంటూ స్టైలిష్‌గా మారిపోయాడు. ఈ రోజు లెన్స్ లుక్ అంటూ మరింత యంగ్‌గా లుక్‌తో సర్‌ప్రైజ్ చేశాడు.
బ్లూ అండ్ వైట్ చక్ షర్ట్ లుక్ 25 ఏళ్ల కుర్రాడిలా మారాడు. 'త్రూ ది లెన్స్' అంటూ కొత్త లుక్‌తో షాకిచ్చాడు. ఇక ఇది చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నాడు. ఇక అమ్మాయిలైతే ఏమున్నాడ్రా బాబు అంటూ మహేష్ ఫోటోలు చూసి స్టన్ అవుతున్నారు.
మరోవైపు ఇది చూసి అంతా ఏంటీ ఈ మేకోవర్ అని ఆలోచన పడుతున్నారు. ఈ లుక్ దేనికోసమని, రాజమౌళి సినిమా కోసం ఇలా ఎప్పుకప్పుడు లుక్ మారుస్తున్నాడా? అని చర్చించుకుంటున్నారు.
SSMB29లో మహేష్ కోసం రాజమౌళి ఎనిమిది లుక్స్ ప్లాన్ చేస్తున్నాడని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మహేష్ ఇలా వరుసగా డిఫరెంట్ డిఫరెంట్ లుక్ షేర్ చేస్తున్నాడు.
అంటే ఈ లుక్స్ వాటికి సంబంధించినవేనా? అని ఆలోచనలో పడుతున్నారు. ఏదేమైన మహేష్ ఈ మేకోవర్ చూసి ఘట్టమనేని ఫ్యాన్స్ మాత్రం తెగ సంబరపడుతున్నారు.