Manchu Lakshmi Photos: మంచు లక్ష్మి పర్ఫెక్ట్ మెహెందీ లుక్ - గ్లామర్ డోస్ మరింత పెంచేసిందిగా..
Manchu Lakshmi Latest Pics: మంచు లక్ష్మి ఇటీవలె ముంబైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే. తన కెరీర్లో మరింత ముందుకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ముంబైకి షిప్ట్ అయినట్టు ఆ మధ్య ఇంటర్య్వూలో వెల్లడించింది. ఇక ముంబైకి వెళ్లినప్పటి నుంచి ఆమె ఫుల్ గ్లామర్ షో చేస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్‌లో ఉన్నంత వరకు పద్దతిగా ఉండే ఫోటోలు, సంప్రదాయమైన చీరకట్టులో ఫోటోలు షేర్ చేసింది. ఉత్తరాదికి వెళ్లిన ఆమె అక్కడ గ్లామర్ డోస్ పెంచి ఫోటోలు షేర్ చేస్తుంది. తగ్గేదే లే అంటూ హీరోయిన్లకు పోటీగా ఫుల్ గ్లామర్ షో చేస్తుంది.
ఈ క్రమంలో మంచు లక్ష్మి మరింత స్టైలిష్‌గా మారింది. తాజాగా ఎల్లో కలర్ ఎంబ్రాయిడరీ సూట్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. వాటికి 'వెడ్డింగ్ సీజన్లో పర్ఫెక్ట్ మెహెందీ లుక్' అంటూ ఫొటోలు షేర్ చేసింది.
నటి, నిర్మాత మంచు లక్ష్మి ప్రసన్న గురించి పరిచయాలు అవసరం లేదు. సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె.. హీరోయిన్గా, విలన్‌గా, క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా, టీవీ హోస్ట్‌గా, ప్రొడ్యూసర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.
ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా వెబ్ సిరీసులు చేస్తోంది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మంచువారమ్మాయి హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
టాలీవుడ్ లో స్థిరపడిపోయిన మంచు లక్ష్మి ఇప్పుడు తన కెరీర్ ను కొత్తగా ప్రారంభించడానికి, మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొన్నాళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్న ఆమె, బాలీవుడ్ లో అవకాశాల కోసం ముంబైకి షిఫ్ట్ అయ్యింది.
హిందీలో ఆడిషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన లక్ష్మీ.. చెప్పిందే తడవుగా ముంబైకి చెక్కేసింది. 'ముంబై.. కొత్త నగరం, కొత్త ప్రపంచం.. ఈ జీవితానికి చాలా కృతజ్ఞతలు. ఎప్పుడూ నన్ను ఆదరిస్తున్నందుకు, నన్ను విశ్వసిస్తున్నందుకు నా అభిమానులందరికీ ధన్యవాదాలు అంటూ నార్త్‌లో వాలిపోయానంటూ