Rashmika Mandanna News Look: రష్మిక కొత్త లుక్ వైరల్ - మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన నేషనల్ క్రష్
Rashmika Mandanna at Milan Fashion Week:బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, వరుస బ్లాక్‌బస్టర్స్, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా దూసుకుపోతుంది. పుష్పతో పాన్ ఇండియా లెవల్ లో రష్మికకు క్రేజ్ పెరిగిపోయింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మికకు మంచి గుర్తింపు వచ్చింది. అదే క్రేజ్‌తో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ సరసన చాన్స్ కొట్టేసింది. యానిమాల్లో అతడికి జోడి కట్టింది.
గతేడాది డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ. 900 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. ఇక ఇందులో గీతాంజలిగా రష్మిక పాత్ర వందకు వంద మార్కులు పడ్డాయి.
ఈ చిత్రంలో ఆమె అందం, అభినయంకు మరోసారి కుర్రకారు ఫిదా అయ్యింది. ఒక్క నటనలోనే ఫ్యాషన్ రంగంలోనూ రష్మికకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అందుకే ఆమె నేషనల్ క్రష్‌గా నెటిన్లను ఆకట్టుకుంటుంది.
తన మేకప్ లుక్, స్కిన్ కలర్, స్మైల్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే ఫ్యాషన్ వేర్‌లోనూ రష్మికను ఫాలో అయ్యే అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం యానిమల్ మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్న రష్మిక తాజాగా ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వేదకపై మెరిసింది.
ఇటలీలోని మిలాన్ నగరంలో జరుగుతున్న ఫ్యాషన్ షోలో పాల్గొని సందడి చేసింది. ఫిబ్రవరి 20 నుంచి 26వరకు జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన మిలాన్ ఫ్యాషన్ వీక్ 2024లో పాల్గొని ర్యాంప్‌పై వాక్ చేసింది.
రష్మిక జపనీస్ ఫ్యాషన్ లేబుల్ అయిన ఒనిత్సుకా టైగర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన బ్రాండ్ తరఫున ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. బ్లాక్ డ్రెస్, షార్ట్ హెయిర్ స్టైల్‌తో ర్యాంప్‌పై వాక్ చేసి సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మిలాన్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ పై రష్మిక