Lata Mangeshkar Photos: నెహ్రూని కంటతడి పెట్టించిన లతా మంగేష్కర్ పాట.. గాన కోకిల అరుదైన ఫోటోలు
1929 సెప్టెంబరు 28న లతా మంగేష్కర్ జన్మించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమీనా, ఆశా భోంస్లే, ఉషా, హృదయనాథ్ అనే నలుగురు తోబుట్టువులు ఉన్నారు.
లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ సుప్రసిద్ధ సంగీతకారుడు. తండ్రి దగ్గరే సంగీతం నేర్చుకున్నారు లతా మంగేష్కర్.
నిజానికి ఆమె అసలు పేరు హేమ. కానీ తన తండ్రి నటించిన 'భవ బంధన్' అనే నాటకంలో లతిక అనే పాత్రలో నటించడం వల్ల ఆమె పేరు లతగా మారిపోయింది.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించిన ఆమె ఎక్కువ కాలం ముంబయిలోనే గడిపారు. తన 13 ఏళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నారు లతా.
1942లో మరాఠీ సినిమా 'కిటి హసల్' సినిమాలో లత మొదటి పాట పాడారు. కానీ, ఆ పాట ఇప్పటికీ రిలీజ్ కాలేదు.
'మహాల్' సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
'ఆగ్', 'శ్రీ 420', 'చోరి చోరి', 'హైవే నెంబర్ 44', 'దేవదాస్' వంటి సినిమాలు లతా క్రేజ్ ను పెంచేశాయి.
1960లో నౌషాద్ అలీ సంగీతంలో వచ్చిన 'మొఘల్-ఏ-ఆజమ్' సినిమాలో పాడిన 'ప్యార్ కియాతో డర్నా క్యా' అనే పాట లతా మంగేష్కర్ స్థాయిని మరింత పెంచింది.
1990లో తన ప్రొడక్షన్ లో గుల్జార్ దర్శకత్వంలో 'లేఖిని' అనే సినిమాను తీశారు. ఈ సినిమాలో ఆమె పాడిన పాటకు నేషనల్ అవార్డు దక్కింది.
జనవరి 27, 1963లో న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో లతా పాడిన 'ఏ మేరే వతన్ కే లోగాన్' అనే దేశభక్తి గీతం వింటూ అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కంటతడి పెట్టారు.
ఈ పాటను 1962 యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు అంకితం చేశారు.