Krithi Shetty : మలయాళంలో డెబ్యూ ఇచ్చేస్తున్న టాలీవుడ్ బేబమ్మ.. టోవిన్ థామస్‌తో కలిసి వచ్చేస్తున్న కృతి శెట్టి
తెలుగులో తన మొదటి సినిమా ఉప్పెనతో ఎక్కడ లేని క్రేజ్‌ని సంపాదించుకుంది కృతిశెట్టి. ఇప్పుడు మలయాళంలో తన డెబ్యూతో అక్కడ లక్‌ని పరీక్షించుకోనుంది.(Images Source : Instagram/Krithi Shetty)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAjayante Randam Moshanam అనే సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తుంది. టోవినో థామస్‌కి జంటగా కృతి శెట్టి ఈ సినిమా చేసింది. (Images Source : Instagram/Krithi Shetty)
ఇది కృతి శెట్టికి మొదటి మలయాళ సినిమా. వరల్డ్ వైడ్‌గా విడుదలవుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా టోవిన్ స్క్రిప్ట్స్కి ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది.(Images Source : Instagram/Krithi Shetty)
ఈ సినిమాను మలయాళంతో పాటు.. తెలుగు, హిందీ, కన్నడ, తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. (Images Source : Instagram/Krithi Shetty)
ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌లో కృతి బిజీగా ఉంది. తాజాగా బ్లూకలర్ చుడీదార్లో ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంది.(Images Source : Instagram/Krithi Shetty)
డ్రెస్‌కి తగ్గట్లు అందంగా ముస్తాబై.. ఫోటోలకు ఫోజులిచ్చింది కృతి. అలాగే లుక్‌కి తగ్గట్లు ఇయర్ రింగ్స్, రింగ్, బ్యాంగిల్స్ ధరించి క్యూట్‌గా కనిపించింది బేబమ్మ.(Images Source : Instagram/Krithi Shetty)