Jyothi Poorvaj : జగతి మేడమ్ నుంచి ఈ లుక్స్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు.. లిప్ ఫిలర్స్తో జ్యోతి పూర్వాజ్ లుక్ అంతా మారిపోయిందిగా
జగతి పూర్వాజ్ ఇలా చెప్పే కంటే..గుప్పెడంత మనసు ఫేమ్ జగతి మేడమ్ అంటే చాలా మంది ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్‌తో అంత క్రేజ్ సంపాదించుకుంది జ్యోతి పూర్వాజ్.(Images Source : Instagram/Jyothi Poorvaj)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎప్పుడూ హాట్‌గా, షార్ట్ డ్రెస్‌లో దర్శనమిచ్చే ఈ భామ.. తాజాగా లంగాఓణి వేసుకుని ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చింది. ఈ లుక్‌లో అస్సలు ఊహించలేదంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.(Images Source : Instagram/Jyothi Poorvaj)
అయితే అందరూ ఫాలో అవుతున్న ట్రెండ్‌నే జ్యోతి పూర్వాజ్ కూడా ఫాలో అయింది. అదే లిప్ ఫిల్లర్స్. ఈమె కూడా తాజాగా ఈ ట్రీట్మెంట్ చేయించుకుంది.(Images Source : Instagram/Jyothi Poorvaj)
దీంతో ఆమె మొహం మారిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మీరు సహజంగానే అందంగా ఉంటారు. ఈ ట్రీట్మెంట్స్ మీకు అవసరం లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Images Source : Instagram/Jyothi Poorvaj)
ఈ మధ్యకాలంలో నటీనటులు లిప్ ఫిల్లర్, బొటాక్స్ వంటి బ్యూటీ ట్రీట్మెంట్లకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఇవి తమని స్క్రీన్‌పై బాగా చూపిస్తాయనే ఉద్దేశంతో వీటిని చేయించుకుంటున్నారు.(Images Source : Instagram/Jyothi Poorvaj)
జ్యోతి పూర్వాజ్ కూడా సీరియల్స్ మానేసి.. సినిమాల వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగానే ఈ బ్యూటీ ట్రీట్మెంట్ చేయించుకున్నట్లు తెలుస్తోంది.(Images Source : Instagram/Jyothi Poorvaj)