Keerthy Suresh: ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో కీర్తి సురేష్ - దసరా టీంతో కలిసి ఫోటోలకు ఫోజులు
Keerthy Suresh Latest Photos: 'మహానటి' కీర్తి సురేష్ ప్రస్తుతం రఘుతాత సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఆగష్టు 15న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ నేపథ్యంలో వరుస ఇంటర్య్వూలో బిజీగా ఉన్న కీర్తి సోషల్ మీడియాలో కొత్త ఫోటోలు షేర్ చేసింది. ఆమె నటించిన దసరా మూవీకి గానూ ఇటీవల ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది.
అనంతరం తన ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో 'దసరా' టీంతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తాజాగా ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోలకు వెన్నెల అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
కాగా గతేడాది నాని ప్రధాన పాత్రలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రం 'దసరా'. మార్చి 30న ఈ సినిమా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాదు నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా చిత్రంగా నిలిచింది.
రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసిన ఈ సినిమాలో కీర్తి సురేష్ వెన్నెలగా డిగ్లామర్ రోల్ పోషించి సహజ నటనతో ఆకట్టుకుంది. ఇక త్వరలోనే 'బేబీ జాన్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.