Happy Birthday Nani: 40వ వసంతంలోకి నేచురల్ స్టార్- నాని గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. అసిస్టెంట్ డైరెక్టర్ మొదలైన ఆయన సినీ ప్రయాణం, ఇప్పుడు స్టార్ హీరో స్థాయికి చేరింది. ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ యాక్టర్ గా కొనసాగుతున్నారు. నటుడిగానే కాకుండా, నిర్మాతగానూ రాణిస్తున్న నాని, ఇవాళ్టిలో 40వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. Photo Credit: Nani/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాని హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. సెయింట్ అల్ఫోన్సస్ హైస్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్, వెస్లీ కాలేజీలో డిగ్రీ చేశారు. ఆ తర్వాత రేడియో జాకీగా కెరీర్ మొదలు పెట్టారు. కొంతకాలం పాటు ఆర్జేగా పని చేశారు. Photo Credit: Nani/Instagram
సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. దర్శకుడు బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. 'రాధా గోపాలం' (2005), 'అల్లరి బుల్లోడు' (2005), 'అస్త్రం' (2006), 'ఢీ' (2007) లాంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు.Photo Credit: Nani/Instagram
ఆ తర్వాత పలు సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేశారు. కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగానూ వ్యవహరించారు. Photo Credit: Nani/Instagram
దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన 'అష్టా చమ్మా' సినిమాతో నాని హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే ఆయన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటి వరకు ఆయన 30కి పైగా సినిమాల్లో నటించారు. Photo Credit: Nani/Instagram
గత ఏడాది ఆయన నటించిన ‘దసరా’, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆయన రీసెంట్ చిత్రం ‘హాయ్ నాన్న’ కూడా చక్కటి హిట్ అయ్యింది. ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేస్తున్నారు.Photo Credit: Nani/Instagram
అవసరాన్ని బట్టి పలువురు హీరోలతో కలిసి మల్టీస్టారర్ మూవీస్ చేశారు నాని. 'వి'లో సుధీర్ బాబుతో, 'దేవదాస్'లో నాగార్జున, ఆది పినిశెట్టితో 'నిన్ను కోరి', విజయ్ దేవరకొండతో 'ఎవడే సుబ్రమణ్యం', అవసరాల శ్రీనివాస్‌తో 'పిల్ల జమీందార్', తనీష్‌తో 'రైడ్' లాంటి సినిమాలు చేశారు. అంతేకాదు, నాని నటించిన పలు సినిమాలు ఇతర భాషల్లోకి డబ్ చేయబడ్డాయి. Photo Credit: Nani/Instagram
నాని హీరోగానే కాకుండా నిర్మాతగానూ పలు సినిమాలు నిర్మించారు.‘వాల్ పోస్టర్ సినిమా’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, పలువురు టాలెంటెడ్ దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ‘డి ఫర్ దోపిడీ’, ‘విస్మయం’, ‘మీట్-క్యూట్’, ‘హిట్: ది ఫస్ట్ కేస్’తో పాటు దాని సీక్వెల్ ను కూడా నిర్మించారు. Photo Credit: Nani/Instagram
నాని పలు షోలకు హోస్టుగానూ వ్యవహరించారు. పాపులర్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్ 2'కి టీవీ హోస్ట్ గా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత, నాని ఈ షోకు హోస్టుగా ఉన్నారు.Photo Credit: Nani/Instagram
అటు 2017లో IIFA ఫిల్మ్ అవార్డ్ షోకు సైతం నాని హోస్టుగా పని చేశారు. నటుడు రానాతో కలిసి ఆయన ఈవెంట్ కు హోస్టుగా వ్యవహరించి అందరినీ ఉత్సాహ పరిచాడు. Photo Credit: Nani/Instagram