Cricketers at the Ambani Wedding : అంబానీ వారింట క్రికెటర్ల సందడి.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సెలబ్రెటీలు

అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు క్రికెట్ దిగ్గజాలు వచ్చారు. క్రికెట్ గాడ్ సచిన్ తెందుల్కర్ ఆయన సతీమణి అంజలితో కలిసి హాజరయ్యారు. సాంప్రదాయ దుస్తుల్లో వారిద్దరూ క్యూట్‌గా కనిపించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. ఆయన భార్య రితికాతో కలిసి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో పాల్గొన్నారు. రితికా లైట్ గ్రీన్ కలర్ గౌన్‌లో కనిపించగా.. రోహిత్ బ్లాక్ షూట్లో కనిపించాడు. వీరిద్దరూ ఫోటోలకు మంచి ఫోజులిచ్చారు.

సెలబ్రేషన్స్‌కు, ఈవెంట్లకు దూరంగా ఉండే మహేంద్ర సింగ్ ధోని కూడా అంబానీ వారింట జరుగుతున్న ప్రీవెడ్డింగ్ వేడుకలకు భార్యతో కలిసి హాజరయ్యారు. ధోని, సాక్షి ఇద్దరూ కూడా ట్రెడీషనల్ దుస్తుల్లో మెరిశారు. ఈ ఈవెంట్లో ధోని దాండియా ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు.
ఇండియన్ ఫేసర్ జహీర్ ఖాన్, ఆయన భార్య సాగరికతో కలిసి వేడుకకు హాజరయ్యారు. సాగరిక వైట్ కలర్ లాంగ్ డ్రెస్‌లో మెరవగా.. జహీర్ వైట్ అండ్ బ్లాక్ షూట్లో మ్యాన్లీగా రెడీ అయ్యారు.
ఈ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలించింది ఎవరంటే ఇవాంకా ట్రంప్. సంప్రాదాయం ఉట్టిపడేలా చీర కట్టుకుంది. ఆమె ఫ్యామిలీతో కలిసి ఈవెంట్‌కు హాజరైంది.
ఇవాంక ట్రంప్ లెహంగాలు ధరించి చాలా అందంగా కనిపించింది. ఆమె చీరను, లెహంగాను కూడా చాలా అందంగా క్యారీ చేసింది. ఆమె కుమార్తె కూడా ట్రెడీషనల్ లుక్‌లో కనిపించారు.