Ambani Family : అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో ఫ్యామిలీ హంగామా మామూలుగా లేదుగా

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అంబానీ ఫ్యామిలీ ఓ రేంజ్లో ఎంజాయ్ చేశారు. నీతా అంబానీ, ముఖేష్ అంబానీ ఈ వేడుకల్లో ఓ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఆకాష్ అంబానీ.. అతని భార్య శ్లోకా మెహతాతో కలిసి ఈ వేడుకల్లో ఎంజాయ్ చేశారు. తన తమ్ముడి పెళ్లిలో ఆకాశ్ చేసిన హంగామా అందరినీ ఆకట్టుకుంది.

ఫ్యామిలీ, సూపర్ స్టార్స్ చేసిన పర్ఫార్మెన్స్లకు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ కూడా అదే రేంజ్లో ఎంజాయ్ చేశారు. చప్పట్లు కొడుతూ.. కేరింతలు కొడుతూ అందరీని ఉత్సాహపరిచారు.
పాప్ స్టార్ రిహన్నాను ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ కలిసి రిసీవ్ చేసుకున్నారు. రిహన్నా పర్ఫార్మెన్స్కు వచ్చిన అతిరథులు బాగా మెస్మరైజ్ అయ్యారు. ఆమె కూడా బాలీవుడ్ నటులతో కలిసి పలు పాటలకు డ్యాన్స్ చేసింది.
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కూడా అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యారు. బిగ్‌బీని ముఖేష్ అంబానీ వెళ్లి రిసీవ్ చేసుకున్నారు.
ఈ వేడుకల్లో ఆకాశ్ అంబానీ, తన భార్య శ్లోకా మెహతాతో కలిసి.. పలు పాటలకు నృత్యాలు చేశారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఆటలు ఆడి, పాటలు పాడి నృత్యాలు చేశారు.
అనంత్ అంబానీ సిస్టర్ ఈషా అంబానీ కూడా వేడుకల్లో సందడిగా పాల్గొంటూ సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చింది.