Ayesha Khan: కుర్రాళ్ల గుండె గుల్ల చేస్తున్న.. ఈ అయేషా ఖాన్ ఎవరు? ఈమె చేతి నిండా సినిమాలే!

‘ముఖచిత్రం’, ‘ఓం భీమ్ బుష్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’... ‘మనమే’ ఈ మూవీస్‌లో సర్ప్రైజ్ చేస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా. ఈమె పేరు అయేషా ఖాన్. హీరోయిన్ నుంచి ఐటెమ్ సాంగ్స్, స్పెషల్ క్యారెక్టర్స్ వరకు.. ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోతూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది ఈ భామ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఇంతకీ ఈ భామ ఎప్పుడు.. ఎలా మన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో తెలుసా? దానికంటే ముందు ఆమె ఈ రంగుల ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టిందో తెలుసుకోవాల్సిందే.

సినిమాల్లోకి రాకముందు అయేషా ఖాన్.. హిందీ పాపులర్ సీరియల్ ‘కసౌటి జిందగీ’లో జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ‘బాల్వీర్ రిటర్న్స్’లో నటించే ఛాన్స్ వచ్చింది.
అలా సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి ‘ఖతరోన్ కా ఖిలాడి’ సీజన్ 14లో ఛాన్స్ వచ్చింది. దీంతో ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది.
ఆ తర్వాత 2023లో ‘బిగ్ బాస్’ సీజన్-17లో అయేషాకు ఛాన్స్ వచ్చింది. అయితే ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీగా 64వ రోజు బిగ్ బాస్‌లోకి వెళ్లింది. ఆ తర్వాత 97వ రోజు ఎలిమినేటర్ అయ్యింది.
అయేషా నటించిన టాలీవుడ్ సినిమాలన్నీ దాదాపు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మాత్రమే నిరుత్సాహ పరిచింది. ఇటీవల విడుదలైన ‘మనమే’లో కాస్త ప్రాధాన్యం ఉన్న పాత్రే లభించింది.
అయేషాకు మరికొన్ని సినిమాల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ నటిస్తూన్న ‘లక్కీ భాస్కర్’లో కూడా అయేషా ఖాన్ నటించింది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.