Varalaxmi Sarathkumar: నెట్టింట వైరల్ అవుతున్న వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ఫోటోలు - చూశారా?
Varalaxmi Sarathkumar Wedding Photos: నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి పీటలు ఎక్కింది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వహకుడు నికోలాయ్ సచ్దేవ్తో ఏడడుగులు వేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇరు కుటుంబసభ్యులు, బంధువులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో థాయిలాండ్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. బుధవారం జూలై 10న వీరి పెళ్లి జరిగినట్టు తెలుస్తుంది.
ఆలస్యంగా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడిఆయలో బయటకు వచ్చాయి. దీంతో వరలక్ష్మి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో ఈ కొత్త జంటకు సోషల్ మీడియాలో శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా మార్చి 1న వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ పెళ్లి ఫోటోల్లో వరలక్ష్మి ఎరుపు రంగు చీర, ఒంటినిండ అందమైన ఆభరణాలతో మెరిసిపోగా.. సచ్దేవ్ క్రిం కలర్ పంచకట్టులో సంప్రదాయ లుక్‌లో కనిపించాడు.
సౌత్ ఇండియన్ సంప్రదాయంలో జరిగిన ఈ ళ్లికి థాయ్‌లాండ్‌కు చెందిన వీరి సన్నిహితులు కూడా హాజరయ్యారు.
అయితే ఇంకా వరలక్ష్మి కానీ, తన తండ్రి శరత్ కుమార్ నుంచి పెళ్లిపై అధికారిక సమాచారం రాలేదు. వరలక్ష్మి కూడా ఇంకా తన పెళ్లి ఫోటోలు షేర్ చేయకపోవడం గమనార్హం.