In Pics: భోగాపురం ఎయిర్పోర్టు పనులు పరిశీలించిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇందుకోసం చంద్రబాబు విజయనగరం పర్యటనకు వెళ్లారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచంద్రబాబునాయుడుతో పాటు భోగాపురం విమానాశ్రయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా సందర్శించి.. ఇద్దరు నిర్మాణ పనులను పరిశీలించారు.
అక్కడ ఎర్త్ వర్క్, టెర్మినల్ భవన నిర్మాణం, రన్ వే పనులు, ఏటీసీ టవర్ పనులను నిర్మాణ సంస్థ అధికారులతో కలిసి పర్యవేక్షించారు.
అనంతరం జరిగిన రివ్యూ సమావేశంలో పాల్గొని త్వరితగతిన విమానాశ్రయం ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా అధికారులకు ఇరువురూ మార్గదర్శకాలు జారీ చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే అత్యున్నత విమానాశ్రయాలలో ఒకటిగా భోగాపురం విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతామని చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఈ విమానాశ్రయం వల్ల భోగాపురం ఎకనామిక్ హబ్ గా తయారవుతుందని వారు వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయ పనులను విహంగ వీక్షణం ద్వారా కూడా చంద్రబాబు పరిశీలించారు.
భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్ అవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆ విమానాశ్రయం ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటానని అన్నారు.
విశాఖపట్నానికి మెట్రో రైలు కూడా రావాల్సి ఉందని అన్నారు. విశాఖపట్నం - విజయనగరం కలిసిపోతున్నాయని.. భవిష్యత్తులో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతాయని చంద్రబాబు అన్నారు.
మున్ముందు కుప్పం సహా 5 విమానాశ్రయాలు వస్తాయని చంద్రబాబు చెప్పారు.
భోగాపురం వరకు బీచ్ రోడ్డు నిర్మాణం జరగాల్సి ఉందని.. పారిశ్రామిక ప్రాంతంగా ఎదగడానికి భోగాపురానికి మంచి అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. నేషనల్ హైవే నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీని పెంచాల్సి ఉందన్నారు.
భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తయి అందుబాటులోకి వస్తే.. మొదట్లోనే దాదాపు 48 లక్షల మంది ప్రయాణికుల తాకిడి ఉంటుందని చంద్రబాబు అంచనా వేశారు.