Sobhita Dhulipala: నాగచైతన్యతో డేటింగ్, ఎంగేజ్మెంట్ - అక్కినేని కొత్త కోడలు శోభిత గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా?
Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ... ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. త్వరలో అక్కినేని ఇంటి కోడలు కాబోతుంది ఈ తెలుగు అమ్మాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొంతకాలంగా శోభిత, నాగ చైతన్యలు రిలేషన్లో ఉన్నట్టు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజం చేస్తూ ఈ జంట రింగులు మార్చుకున్ని తమ బంధాన్ని ఆఫీషియల్ చేశారు.
ఆగష్టు 8న కేవలం ఇరుకుటుంబ సభ్యుల మధ్య సింపుల్‌గా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కింగ్ నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
అంతేకాదు కొత్త జీవితం ప్రారంభించబోతున్న నాగచైతన్య-శోభితలను ఆశీర్వాదించాలని కోరారు. మొత్తానికి ఈ జంట ఒక్కటి కావడంతో సోషల్ మీడియాలో వారికి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
అయితే త్వరలోనే అక్కినేని కోడలు కాబోతున్న శోభితా మన తెలుగు అమ్మాయి అనే విషయం తెలుసా! 1992లో మే 31న ఆంధ్రప్రదేశ్ తెనాలిలో జన్మించింది.
బ్రహ్మణ కుటుంబానికి చెందిన శోభిత విద్యాభ్యాసం మొత్తం విశాఖపట్నంలోనే పూర్తి చేసింది. ఆ తర్వాత ముంబై యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్‌లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసిన శోభిత భరతనాట్యం, కూచిపూడిలోనూ శిక్షణ పొందింది.
చదువు అనంతరం మోడలింగ్ రంగంలోకి అడుగపెట్టిన ఆమె 2013లో ఫెమినా మిస్ ఇండియాల పోటిల్లో రన్నర్‌గా నిలిచింది. అదే ఏడాది మిస్ ఎర్త్ ఇండియా అందాలో పోటీల్లో భారత్ తరపున పాల్గొంది.
ఆ తర్వాత 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిచిన రామన్ రాఘవ్ 2.0 చిత్రం సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత గుఢాచారి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఇందులో టెర్రిరిస్టుల స్పైగా కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత మేజర్‌లోనూ ఓ కీ రోల్లో కనిపించింది. తెలుగులో చేసింది రెండు మూడు సినిమాలే అయినా నాగ చైతన్యతో రిలేషన్‌తో ఆమె తరచూ వార్తల్లో నిలిచేది.
ఇప్పుడు ఏకంగా నాగ చైతన్యతో పెళ్లికి రెడీ అయ్యి అక్కినేని కోడలు బిరుదు కొట్టేసింది. అయితే శోభితా నాగ చైతన్య కంటే ముందు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రణవ్ మిశ్రాతో కొంతకాలం డేటింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కొద్ది రోజులకే వారిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారట.