టాటా కొత్త కారులో అదిరిపోయే ఫీచర్లు.. మరే కారులోనూ ఇవి లేవంటే నమ్ముతారా?
టాటా మోటార్స్ భారతదేశపు మొట్టమొదటి కూపే స్టైల్ ఎలక్ట్రిక్ SUVని అధికారికంగా ఆగస్టు 7న విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన బుకింగ్‌లు ఆగస్టు 12 నుంచి టాటా షోరూమ్‌లలో ప్రారంభమవుతాయి. ఈ ఎస్‌యూవీలో ఉన్న ఫీచర్లు మరే కార్లలోనూ లేవు. టాటా కార్ అభిమానులకు తగినట్లుగా ఈ కారుని రూపొందించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appధర: టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారు SUV కూపే డిజైన్‌తో వచ్చిన తొలి కారుగా చరిత్ర సృష్టించింది. ఇందులో భారీ ఫీచర్లు ఉన్నప్పటికీ, దీని ధర రూ. 17.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ప్రకటించి ఆశ్చర్యపరిచింది. ఈ కారు ఎలక్ట్రిక్ మరియు రెండు ICE వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. టాప్ ఎండ్ ధర రూ. 21.99 లక్షలుగా ఉంది.
రేంజ్: టాటా మోటార్స్ పోటీదారులతో పోలిస్తే అత్యుత్తమ రేంజ్‌ని అందిస్తుంది. అందులో భాగంగానే కర్వ్‌లోని 55 kW బ్యాటరీ ప్యాక్ MIDC ప్రమాణాల ప్రకారం ఫుల్ ఛార్జ్‌పై 585 కిమీల ఆకట్టుకునే రేంజ్‌ని అందిస్తుంది. మహీంద్రా XUV400 456 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. MG ZS సింగిల్ ఛార్జ్‌పై 461 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.
అతిపెద్ద బ్యాటరీ ఆప్షన్స్: కర్వ్ 45kW బ్యాటరీ ప్యాక్ మరియు పెద్ద 55kW బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఈ ధర పరిధిలో మరే ఇతర కారు 55kW బ్యాటరీ ప్యాక్‌ను అందించదు. MG ZS కేవలం 50.3 kW బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. అలాగే మహీంద్రా XUV 400 39.4 kW బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది.
రేంజ్: టాటా మోటార్స్ పోటీదారులతో పోలిస్తే అత్యుత్తమ రేంజ్‌ని అందిస్తుంది. అందులో భాగంగానే కర్వ్‌లోని 55 kW బ్యాటరీ ప్యాక్ MIDC ప్రమాణాల ప్రకారం ఫుల్ ఛార్జ్‌పై 585 కిమీల ఆకట్టుకునే రేంజ్‌ని అందిస్తుంది. మహీంద్రా XUV400 456 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. MG ZS సింగిల్ ఛార్జ్‌పై 461 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.
బూట్ స్పేస్: టాటా కర్వ్ 500 లీటర్ల విశాలమైన బూట్ కెపాసిటీతో ప్రత్యేకంగా నిలుస్తుంది. వెనుక సీటు 60:40 నిష్పత్తిలో తీసుకువచ్చారు. ఇది బూట్ స్పేస్‌ని 40 శాతంలో ఉండగా 689 లీటర్లకు పెరుగుతుంది. 60 శాతం పెరిగినప్పుడు 784 లీటర్లకు విస్తరిస్తుంది. రెండు సీట్లను మడతపెట్టడం వల్ల దీని బూట్ స్పేస్ ఏకంగా 973 లీటర్లకు పెరుగుతుంది.
పవర్డ్ డోర్ ఫీచర్: ఈ SUV వెనుక స్పాయిలర్‌కు కనెక్ట్ చేయబడిన LED టైల్‌లైట్‌లతో వస్తుంది. ఇది పవర్ డోర్ ఆప్షన్‌ని కలిగి ఉంటుంది. మీరు మీ పాదాలను కారు కింద ఉంచినప్పుడు వెనుక డోర్ ఆటోమేటిక్‌గా తెరుచుకుంటుంది. ఈ సదుపాయంతో వెనక డోర్‌ని సులభంగా ఓపెన్ చేయవచ్చు.
AVAS టెక్నాలజీ: టాటా కర్వ్ భారతదేశంలో మొదటిసారిగా అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ (AVAS) టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఈ సిస్టమ్ కారు గంటకు 20 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో కదులుతున్నప్పుడు ఎవరైనా కారు సమీపంలోకి వస్తే కృత్రిమ శబ్దాలతో పాదచారులను హెచ్చరిస్తుంది. ఇది రద్దీ రోడ్లలో పాదచారుల భద్రతను మెరుగుపరుస్తుంది. ఈ సాంకేతికతను ఇంకా ప్రభుత్వం తప్పనిసరి చేయనప్పటికీ, అదనపు భద్రత కోసం టాటా మోటార్స్ తమ వాహనంలో దీనిని చేర్చడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
మొత్తంమీద టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ SUV కూపే వినూత్న ఫీచర్లు మరియు అధునాతన సాంకేతికతను కలిగి ఉంది. అంతే కాకుండా దీనిని ఆకర్షణీయమైన ధర లాంచ్ చేయడంతో కస్టమర్లను ఆక్టటుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఎస్‌యూవీలను ఇప్పటికే షోరూమ్‌లకు తరలించింది. ఇక డెలివరీలు చేయడమే మిగిలింది.