Paris Olympics 2024: కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు
ఒలింపిక్స్ కాంస్య పోరులో భారత హాకీ యోధులు అదరగొట్టారు. విశ్వ క్రీడల్లో దేశానికి నాలుగో కాంస్య పతకం అందించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్పెయిన్‌ను చిత్తు చేస్తూ వరుసగా రెండో పతకాన్ని భారత్‌కు అందించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుత ఆటతీరుతో అలరించిన వేళ... భారత్ పతకాల సంఖ్య నాలుగుకు పెరిగింది.
ఒకదశలో వెనకబడిన సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ వరుస గోల్స్‌తో ప్రత్యర్థికి దడపుట్టించాడు. ఆఖర్లో స్పెయిన్ రెండు గోల్ ప్రయత్నాలను అడ్డుకొని టీమిండియా చిరస్మరణీయ విజయంతో కాంస్యాన్ని ముద్దాడింది.
తన కెరియర్ లో ఆఖరి ఒలింపిక్స్ ఆడుతున్న గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్‌కు ఘనమైన వీడ్కోలు ఇది.
విశ్వ క్రీడల్లో ఆద్యంతం రఫ్పాడించిన భారత హాకీ జట్టు కాంస్యం మ్యాచ్‌లోనూ చెలరేగింది. ప్రత్యర్థి గోల్ ప్రయత్నాలను సమర్ధంగా అడ్డుకొని పకత గర్జనతో యావత్ దేశాన్ని సంబురాల్లో ముంచెత్తింది.
తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన ది గ్రేట్ ఆఫ్ వాల్ ఆప్ ఇండియా శ్రీజేష్ భావోద్వేగానికి గురయ్యాడు. విశ్వ క్రీడల్లో కాంస్య పతకంతో తన సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
పారిస్ ఒలింపిక్స్‌లో టీమిండియా అద్భుత విజయాలతో దూసుకెళ్లింది. 52 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆసీస్‌పై విక్టరీతో చరిత్ర సృష్టించింది.
నాలుగు దశాబ్దాల ఎదురుచూపుల తరువాత 2021 టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్య పతకంతో మెరిసింది. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లోనూ కాంస్య పతకాన్ని సాధించి వరుసగా రెండో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.