Naga Chaitanya: ఉయ్యాలలో ఊసులు.. కళ్లతోనే కబుర్లు.. చైతూ, శోభితాల ఎంగేజ్మెంట్ ఫొటోలు చూస్తే ఔరా అనాల్సిందే!
గత కొన్నాళ్లుగా డేటింగులో ఉన్న టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళ ఎట్టకేలకు ఎంగేజ్మెంట్తో ఫ్యాన్స్‌ను సంతోష పెట్టారు. త్వరలోనే వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారంటూ స్వయంగా అక్కినేని నాగార్జునే వారి ఫొటోలను షేర్ చేసుకుని ఈ గుడ్ న్యూస్ చెప్పారు. నాగ చైతన్య, శోభితాల నిశ్చితార్థం ఫొటోలు చూసి.. అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. - Images Credit: Sobhita Dhulipala and Naga Chaitanya
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచైతూ, శోభితాల ఎంగేజ్‌మెంట్‌ను చాలా సింపుల్‌గా చేశారు. కేవలం కుటుంబ సభ్యుల మధ్యనే వీరి నిశ్చితార్థం జరిగింది. - Images Credit: Sobhita Dhulipala and Naga Chaitanya
ఎలాంటి హంగామా లేకుండా.. కేవలం అరిటాకులతో అలంకరించిన వేదికపై నాగ చైతన్య, శోభితాల నిశ్చితార్థం జరిగింది. - Images Credit: Sobhita Dhulipala and Naga Chaitanya
వేదిక పక్కనే ఏర్పాటు చేసిన ఉయ్యాలలో కూర్చున్న నాగ చైతన్య, శోభితా.. కళ్లతోనే కబుర్లు చెప్పుకుంటూ లోకాన్ని మరిచిపోయారు. - Images Credit: Sobhita Dhulipala and Naga Chaitanya
తాజాగా చైతూ, శోభితాలు ఈ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. - Images Credit: Sobhita Dhulipala and Naga Chaitanya
చైతూ, శోభితాల నిశ్చితార్థం ఆగస్టు 8, ఉదయం 9.42 గంటలకు జరిగింది. ‘8.8.8.. అనంతమైన ప్రేమకు ప్రారంభం’ అంటూ నాగార్జున వారిని ఆశీర్వదించారు. 888 అంటే.. 8వ తేదీ, 8వ నెల.. 2+0+2+4. - Images Credit: Sobhita Dhulipala and Naga Chaitanya