HBD Mahesh Babu: ఒక్క యాడ్‌కి మహేష్ ఎంత తీసుకుంటాడో తెలుసా? - ఈ ప్రిన్స్ తర్వాతే అల్లు అర్జున్, రామ్ చరణ్..!
![HBD Mahesh Babu: ఒక్క యాడ్‌కి మహేష్ ఎంత తీసుకుంటాడో తెలుసా? - ఈ ప్రిన్స్ తర్వాతే అల్లు అర్జున్, రామ్ చరణ్..! HBD Mahesh Babu: ఒక్క యాడ్‌కి మహేష్ ఎంత తీసుకుంటాడో తెలుసా? - ఈ ప్రిన్స్ తర్వాతే అల్లు అర్జున్, రామ్ చరణ్..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/09/465ac047420a9e066e8b6f853235a6967cd91.jpg?impolicy=abp_cdn&imwidth=800)
Mahesh babu Assets: సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఆయనకు అమ్మాయిల ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App![HBD Mahesh Babu: ఒక్క యాడ్‌కి మహేష్ ఎంత తీసుకుంటాడో తెలుసా? - ఈ ప్రిన్స్ తర్వాతే అల్లు అర్జున్, రామ్ చరణ్..! HBD Mahesh Babu: ఒక్క యాడ్‌కి మహేష్ ఎంత తీసుకుంటాడో తెలుసా? - ఈ ప్రిన్స్ తర్వాతే అల్లు అర్జున్, రామ్ చరణ్..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/09/6ba95a5ba4ee90e4647f5291019438cd0ea2a.jpg?impolicy=abp_cdn&imwidth=800)
ఐదు పదుల వయసు దగ్గర్లో ఉన్న 25 ఏళ్ల కుర్రాడిలా గ్లామర్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇవాళ ఈ టాలీవుడ్ ప్రిన్స్ బర్త్‌డే. ఆగష్టు 9న 49వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు.ఆ ఈ సందర్భంగా ఆయనకు ఫ్యాన్స్, సినీ సెలబ్రిటీల నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
![HBD Mahesh Babu: ఒక్క యాడ్‌కి మహేష్ ఎంత తీసుకుంటాడో తెలుసా? - ఈ ప్రిన్స్ తర్వాతే అల్లు అర్జున్, రామ్ చరణ్..! HBD Mahesh Babu: ఒక్క యాడ్‌కి మహేష్ ఎంత తీసుకుంటాడో తెలుసా? - ఈ ప్రిన్స్ తర్వాతే అల్లు అర్జున్, రామ్ చరణ్..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/09/e27949f7c2d2e349c84912db956556fcbaad0.jpg?impolicy=abp_cdn&imwidth=800)
అలాగే కోట్ల ఖర్చ పెట్టి పేదలకు ఉచితంగా వైద్య సేవలు, చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయిస్తున్న ఈ 'శ్రీమంతుడు' ఆస్తులపై ఆరా తీస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు.
అంతేకాదు త్వరలోనే పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాడు. హీరోగా బాగానే సంపాదిస్తున్న ఆయన ఒక్కొక్క సినిమాకు రూ.50 నుంచి 80 కోట్లు పారితోషికం తీసుకుంటాడని సమాచారం.
అలాగే ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మౌంటెన్ డ్యూ, థమ్స్ప్తో వంటి పలు వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. అలా దాదాపు ఎమినిమి నుంచి తొమ్మిది బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా ఉన్నాడు మహేష్.
అయితే ఒక్కొ యాడ్‌కి ఆయన ఎంత తీసుకుంటాడో తెలిస్తే అవాక్క్ అవుతారు. ఇండియన్ సెలబ్రిటీల్లో ఒక ప్రకటన అత్యధికంగా పారితోషికం తీసుకునేది ఈ టాలీవుడ్ ప్రీన్సే అట.
ఈయన ఒక్కొ ప్రకటనకు రూ. 6 కోట్ల నుంచి రూ. 8 కోట్ల తీసుకుంటాడని సమాచారం. మహేష్ బాబు తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తీసుకుంటున్నాడట.
ఇక టాలీవుడ్ మహేష్ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్‌లు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారట. ఇక మహేష్ నటుడిగా కూడా భారీగ ఆస్తులు కూడ బెట్టాడు.
సొంతంగా ప్రొడక్షన్ హౌజ్, ఎషియన్ మాల్, ఫుడ్ బిజినెస్ ఇలా చాలా వ్యాపారాలు చేస్తున్నాడు. అలా మొత్తంగా మహేష్ ఆస్తి రూ. 350 నుంచి రూ. 400 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
హైదరాబాద్‌లోని ఆయన ఇంటి విలువ రూ.30 కోట్లు ఉంటుందట. జూబ్లీహిల్స్‌లోని ఈ ఇంట్లో దాదాపు అన్ని అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. అలాగే ఆయన పలు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అందులో రూ. 7 కోట్ల వాల్యూ వ్యానిటీ వ్యాన్ కూడా ఒకటి.