Venkatesh Daughter Marriage: వెంకటేష్ రెండో కూతురి పెళ్లిలో మహేష్ కూతురు సితార సందడి - ఫోటోలు చూశారా?
టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ ఇంటిలో పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండో కుమార్తె హయవాహిని పెళ్లి మార్చి 15న (శుక్రవారం) హైదరాబాద్ సిటీలో జరుగుతోంది. ఈ వివాహ వేడుకకు అతికొద్ది మంది బంధుమిత్రులు, సినీ ప్రముఖులు మాత్రమే హాజరు కానున్నారని తెలిసింది. పెళ్లికి ముందు రోజు సంగీత్, మెహందీ వేడుకలు జరిగాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత, కుమార్తె సితార ఘట్టమనేని సందడి చేశారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: namratashirodkar / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'నూతన వధూవరులు జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో మెహందీ రోజు మంచి టైమ్ స్పెండ్ చేశాం' అని నమ్రతా శిరోద్కర్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: namratashirodkar / Instagram)
నమ్రతతో పాటు కుమార్తె సితార ఘట్టమనేని సైతం హయవాహిని మెహందీ వేడుకలో సందడి చేశారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. సితార స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారని ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: namratashirodkar / Instagram)
తల్లీ కుమార్తెలు నమ్రతా శిరోద్కర్ మహేష్, సితార ఘట్టమనేని (Image Courtesy: namratashirodkar / Instagram)
వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని మెహందీ వేడుకలో స్నేహితులతో నమ్రతా మహేష్ (Image Courtesy: namratashirodkar / Instagram)