Allu Arjun - Sukumar: బన్నీని గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్న సుకుమార్!
‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని అద్భుతమైన నటనకు గానూ బన్నీ జాతీయ చలన చిత్ర అవార్డును సొంతం చేసుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సంతోషాన్ని అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, 'పుష్ప' దర్శక నిర్మాతలతో సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా తన తండ్రి అల్లు అరవింద్‌కు పాదాభివందనం చేసిన బన్నీ.. తల్లి, భార్యాబిడ్డలను హత్తుకొని తన ఆనంద క్షణాలను పంచుకున్నారు.
అలానే దర్శకుడు సుకుమార్ బన్నీని గట్టిగా హగ్ చేసుకొని, బుగ్గను ముద్దాడుతూ శుభాకాంక్షలు తెలియజేసారు.
మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రవి శంకర్, నవీన్ యెర్నేనిలు అల్లు అర్జున్ కి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి అభినందించారు.
బన్నీకి ఆంధ్రప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం నాయకులు గంటా శ్రీనివాసరావు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఉత్తమ నటుడిగా జాతీయ చలన చిత్ర అవార్డు సాధించిన అల్లు అర్జున్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అభినందించారు.
నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ సాధించిన అల్లు అర్జున్.