Happy Birthday Prabhas: ప్రభాస్ ఫ్యామిలీ పర్సనల్ ఆల్బమ్‌లో ఫోటోలు చూశారా... ఈ బర్త్ డేకి పర్ఫెక్ట్ గిఫ్ట్
Prabhas Throwback Photos: అక్టోబర్ 23... ప్రభాస్ బర్త్ డే. ఆయనకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ అందరూ విషెస్ చెబుతారు. అందులో సందేహం లేదు. అయితే, ఒక్కరి విషెస్ మాత్రం చాలా స్పెషల్. ఇంత వరకు ఫ్యాన్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు ఎవరూ చూడని పర్సనల్ ఫ్యామిలీ ఆల్బమ్ షేర్ చేశారు ప్రసీద ఉప్పలపాటి. (Image Courtesy: praseedhauppalapati / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రభాస్ తో పాటు ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఎవరో తెలుసా? అందులో ఒకరు ఇప్పుడు నిర్మాత కూడా! ఈ ఓల్డ్ ఫోటోను ఆవిడ షేర్ చేశారు. (Image Courtesy: praseedhauppalapati / Instagram)
రెబల్ స్టార్ కృష్ణంరాజు పెద్ద కుమార్తె, 'రాధే శ్యామ్' నిర్మాతలలో ఒకరైన ప్రసీద ఉప్పలపాటి తెలుసు కదా! ఆమె ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. (Image Courtesy: praseedhauppalapati / Instagram)
కృష్ణంరాజు, శ్యామల దేవి దంపతులకు ముగ్గురు అమ్మాయిలు. ఆ అమ్మాయిలు చిన్నప్పుడు వారితో ప్రభాస్ దిగిన ఫోటో. (Image Courtesy: praseedhauppalapati / Instagram)
ప్రభాస్ ఇలా నవ్వడం ఎప్పుడైనా చూశారా? ఫ్యామిలీతో ఆయన ఎంత సరదాగా ఉంటారనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ప్రసీద షేర్ చేసిన ఫోటోల్లో ఇదొకటి. (Image Courtesy: praseedhauppalapati / Instagram)
సిస్టర్స్ అంటే ప్రభాస్ కు ఎంతో ఇష్టం. వాళ్లను కంటికిరెప్పలా, అపురూపంగా చూసుకుంటారని సన్నిహితులు చెబుతారు. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో బ్రదర్ అండ్ సిస్టర్. (Image Courtesy: praseedhauppalapati / Instagram)
'కల్కి 2898 ఏడీ' సాంగ్ షూటింగ్ టైంలో ప్రభాస్ తో సిస్టర్స్ ముగ్గురు కలిసి ఫోటోలు దిగారు. అందులో ఓ ఫోటో ఇది. (Image Courtesy: praseedhauppalapati / Instagram)
దివంగత కథానాయకుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ఆయన పిల్లలు. ప్రభాస్ ఫోజు చూశారా? శ్రీ కృష్ణుడి తరహాలో ఉంది. (Image Courtesy: praseedhauppalapati / Instagram)
కృష్ణంరాజు, ప్రభాస్ తో ఫ్యామిలీ మెంబర్స్. అందులో కృష్ణంరాజు ముగ్గురు కుమార్తెలు, భార్యతో పాటు మరొకరు కూడా ఉన్నారు. (Image Courtesy: praseedhauppalapati / Instagram)
ప్రసీద పుట్టినరోజు సందర్భంగా ఆమెకు కేక్ తినిపిస్తున్న ప్రభాస్. (Image Courtesy: praseedhauppalapati / Instagram)