Vijayawada Drone Show: 5,500 డ్రోన్లతో ఆకాశంలో అద్భుతం, కృష్ణా తీరంలో అతిపెద్ద డ్రోన్ షో
విజయవాడ డ్రోన్ షోకు ఐదు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు ధ్రువపత్రాలు అందించారు. 1) లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్ లో గిన్నిస్ రికార్డు 2) నదీ తీరాన లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టితో మరో గిన్నిస్ రికార్డ్ 3) అతిపెద్ద విమానాకృతి (Largest Plane Formation)లో గిన్నిస్ రికార్డ్ 4) డ్రోన్లతో అతిపెద్ద జాతీయ జెండా ఆకృతి క్రియేట్ చేసి గిన్నిస్ రికార్డ్ 5) అతిపెద్ద ఏరియల్ లోగో ఆకృతితో ఐదో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద అరుదైన దృశ్యాలు అవిష్కృతం అయ్యాయి. ఆకాశం నుంచి చుక్కలు దిగి వచ్చాయా అన్నట్లు కనిపించింది.
జాతీయ డ్రోన్ సమ్మిట్లో భాగంగా దేశంలోనే తొలిసారిగా 5,500 డ్రోన్లతో ఏపీ ప్రభుత్వం భారీ ప్రదర్శన నిర్వహించింది. భారీగా సందర్శకులు రావడంతో కృష్ణాతీరం జనసంద్రంగా మారింది.
రాజధాని అమరావతిని స్మరించేలా ధ్యానబుద్ధుడు, భారీ బోయింగ్ విమానం, డ్రోన్, అంతర్జాతీయ స్థాయిలో భారత్ అనేలా గ్లోబ్ చిత్రాలను డ్రోన్ల ద్వారా ఆవిష్కరించారు.
డ్రోన్ షో వీక్షించేలా విజయవాడలో ఐదు ప్రాంతాల్లో డిస్ ప్లేలు ఏర్పాటు చేశారు అధికారులు. అంతకుముందు లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
విజయవాడ పున్నమిఘాట్లో జరిగిన భారీ డ్రోన్ షోలో పలు ముఖ్యమైన థీమ్ చిత్రాలను ప్రదర్శించారు. విమానయానానికి తద్వారా డ్రోన్లయానానికి పితామహుడిగా పేరొందిన రైట్ బ్రదర్స్ చిత్రాన్ని తొలుత ఆవిష్కరించారు.
పున్నమి ఘాట్ వద్ద రికార్డు స్థాయిలో డ్రోన్ల విన్యాసం చూపరుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారితో పాటు లైవ్ చూసిన వారిని భారీ డ్రోన్ షో కట్టిపడేసింది.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డ్రోన్ హ్యాకథాన్లో విజేతల్ని ప్రకటించి సీఎం చంద్రబాబు చెక్కులు అందజేశారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ డ్రోన్ షోను ఆసక్తిగా వీక్షించారు.