Kalki 2898 AD Event: గ్రాండ్‌గా 'కల్కి 2898 AD' ఈవెంట్ - బుజ్జి లుక్ రివీల్, భైరవ లుక్‌లో ఆకట్టుకున్న 'డార్లింగ్'
Kalki 2898 AD Event in Ramoji Film City Photos: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'కల్కి 2898 AD'.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసైన్స్ ఫిక్షన్ డ్రామా వస్తున్న ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ఈ సినిమాలోనే స్పెషల్ పర్సన్‌ని పరిచయం చేసింది.
ఈ చిత్రంలోనే కీ రోల్ పోషించే బుజ్జిని తాజాగా ఇంట్రడ్యూస్ చేసింది. ఇందుకోసం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ ఈవెంట్‌ని నిర్వహించింది.
కార్యక్రమంలో ఏకంగా బుజ్జినే రంగంలోకి దింపి ఆడియన్స్‌ని కనుల పండుగ ఇచ్చింది కల్కి టీం. కాగా ఈ సినిమాలో బుజ్జి అంటే ప్రభాస్ వాడే వాహనం పేరు.
ఈ చిత్రంలోనే ఇది కీలకం కానుంది. ఈ నేపథ్యంలో బుజ్జి లుక్‌ని చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశాడు నాగ్ అశ్విన్. ఇక రామోజీ ఫలిం సిటీలో జరిగిన ఈ ఈవెంట్ ప్రభాస్ ఏకంగా భైరవ లుక్ దర్శనం ఇచ్చాడు.
ఈ ఈవెంట్లో ప్రభాస్ బుజ్జిపై రయ్ రయ్ మంటూ వచ్చి ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేశాడు.
ప్రస్తుతం బుజ్జి లుక్ ప్రతిఒక్కరి ఆకట్టుకుంటుంది. అత్యాధునికి టెక్నాలజీతో తయారు చేసిన ఈ కారు చూడటానికి కనుల పండుగా ఉంది.
ఇక ఈ ఈవెంట్లో ప్రభాస్ భైరవ లుక్, బుజ్జి లుక్ బాగా ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఈవెంట్లో ప్రభాస్ నేరుగా భైరవగా లుక్‌లో ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్‌కి కనుల పండుగ అందించాడు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఈవెంట్లో ప్రభాస్, నాగ్ అశ్విన్‌తో పాటు కల్కి టీంకు చెందిన పలువురు నటీనటులు, నిర్మాతలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
భారీ భద్రత, బందోబస్తు మధ్య నిర్వహించిన ఈ కల్కి ఈవెంట్‌కు రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు.