Sreeleela: ముంబైలో Kissik స్మైల్‌తో శ్రీ లీల - బాలీవుడ్ స్టార్ కొడుకుతో కలిసి...
శ్రీ లీల గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పేది ఏముంది? సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ మహారాజ్ రవితేజతో మొదలు పెడితే యంగ్ స్టార్ హీరోలు చాలా మందితో క్రేజీ ప్రాజెక్టుల్లో శ్రీ లీల నటించింది. ఇప్పుడు ఆవిడ బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ వారసుడు, హీరోయిన్ సారా అలీ ఖాన్ సోదరుడు, త్వరలో వెండితెరకు పరిచయం కాబోతున్న ఇబ్రహీం ఖాన్‌తో ముంబైలోని ఓ స్టూడియో బయట శ్రీ లీల కనిపించింది. కెమెరా కంటికి చిక్కింది.
'పుష్ప 2: ది రూల్'లోని 'కిస్సిక్...' సాంగ్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ శ్రీ లీల పాపులర్ అయ్యారు. ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో డైరెక్ట్ స్టెప్ వేయడానికి రెడీ అయ్యారు.
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలో శ్రీ లీల మొదటి హిందీ సినిమా చేయనున్నారు. అందులో ఇబ్రహీం అలీ ఖాన్ హీరో.
వరుణ్ ధావన్ సినిమాలో శ్రీ లీల నటించనున్నారని ప్రచారం జరిగింది. అయితే, చివరకు ఆ సినిమాలో పూజా హెగ్డే ఎంపిక అయ్యింది.
కార్తీక్ ఆర్యన్ సరసన కూడా శ్రీ లీల ఒక సినిమా చేసే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి, ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో?
తెలుగులో ప్రజెంట్ శ్రీ లీల చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. నితిన్ జంటగా ఆవిడ నటించిన 'రాబిన్ హుడ్' షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అది త్వరలో విడుదల కానుంది. 'ధమాకా' హిట్ తర్వాత రవితేజతో మరొక సినిమా 'మాస్ జాతర' చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా ఆవిడ చేతిలో ఉంది.