Kamakshi Bhaskarla: కామాక్షి కామాక్షి... అందంతో అట్టా సంపేస్తుంటే ఎట్టా మరి - 'పొలిమేర' బ్యూటీ కొత్త ఫోటోషూట్
హార్డ్ వర్క్ ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతారని ప్రూవ్ చేసిన హీరోయిన్లలో కామాక్షి భాస్కర్ల ఒకరు. కథానాయికగా మొదటి సినిమా 'ప్రియురాలు'తో ఆవిడ మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'లో చిన్న పాత్రలో మెరిసిన కామాక్షికి 'మా ఊరి పొలిమేర' గుర్తింపుతో పాటు విజయాన్ని అందించింది. ఆ సినిమా విడుదలైన ఏడాది 'రౌడీ బాయ్స్', 'కుబూల్ హై','ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాలతో పాటు 'ఝాన్సీ' వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కామాక్షి భాస్కర్లకు గడిచిన రెండేళ్లు గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. సూపర్ సక్సెస్ ఫుల్ ఫిలిమ్స్, సిరీస్ లలో ఆవిడ నటించారు. వంద కోట్లు వసూలు చేసిన 'విరూపాక్ష' సినిమాలో కీలక పాత్ర చేశారు. ఆవిడ కథానాయికగా నటించిన 'పొలిమేర 2' భారీ హిట్ అయ్యింది.
శ్రీ విష్ణు 'ఓం భీం బుష్' సినిమాలో కామాక్షి అతిథి పాత్రలో సందడి చేశారు. అలాగే, అక్కినేని నాగ చైతన్య 'దూత' వెబ్ సిరీస్ లోనూ ఆవిడ నటించారు.
కామాక్షి భాస్కర్ల చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ నెట్టింట వైరల్ అవుతోంది. అందం, అభినయం కలగలిపిన కామాక్షి భాస్కర్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతోంది. 'పొలిమేర 3'తో ఆవిడ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
అందాల భామల ఫోటో గ్యాలరీలతో పాటు తాజా రాజకీయ, సినీ వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.