Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..ఏం చేస్తారంటే!
సాధారణంగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని చెప్పారు టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, ఈవో శ్రీ జె శ్యామలరావు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆనందనిలయం మొదలు బంగారువాకిలి వరకు..శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను పవిత్రమైన పరిమళ జలాన్ని ప్రోక్షణ చేశారు
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచుతారు
శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేసిన తర్వాత మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజల చేస్తారు
TTD బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి, శ్రీ సాంబశివరావు, శ్రీ రాజశేఖర్ గౌడ్, శ్రీమతి సుచిత్ర యెల్లా, శ్రీమతి పనబాక లక్ష్మి, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్వో శ్రీ శ్రీధర్, జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు