Pooja Hegde: చాలా రోజుల తర్వాత మీడియా కంటపడ్డ పూజా - ఎయిర్ పోర్టు ఫొటోలు వైరల్
Pooja Latest Photos: ప్రస్తుతం బుట్టబొమ్మ పూజ హెగ్డేకు బ్యాడ్ నడుస్తుంది. తెలుగు ఆఫర్స్ దక్కడంతో బాలీవుడ్ మాకాం మార్చింది ఈ బ్యూటీ. అక్కడ కూడా పెద్దగా సక్సెస్ లేకపోవడం ఈ అమ్మడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమొన్నట్టి వరకు తెలుగులో పూజ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూకుడు చూపించింది. లక్కీ లెగ్ అంటూ నెత్తిన పెట్టుకున్న ఇండస్ట్రీ వర్గాలు ఇప్పుడు ఆమెను పక్కన పెడుతున్నాయి.
పూజా సినిమా అంటే మూవీ హిట్ అనేంతగా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. అయితే ఆమె దూకుడుకు రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు బ్రేక్ వేశాయి. ఈ రెండు సినిమాల ఫ్లాప్‌తో లక్కీ లెగ్ కాస్తా ఐరన్ లెగ్ అయ్యింది.
ఇంకేముందు ఈ మార్క్ పడినప్పటి నుంచి వరుసగా ఆమెను సినిమాల నుంచి తొలగించారు. రీసెంట్గా విడుదలైన గుంటూరు కారం నుంచి పూజాను తప్పించిన సంగతి తెలిసిందే.
ఈ మూవీ నుంచి ఆమె తప్పుకుందంటూ వార్తలు వచ్చాయో లేదో ఆ వెంటనే వరుసగా ఆమె సైన్ సినిమాల నుంచి కూడా పూజా తప్పుకుంది. దీనికి అసలు కారణం తెలియదు కానీ, ప్రస్తుతం యంగ్ హీరోయిన్ల క్రేజ్ వల్లే ఆమెను తప్పించారని ఇన్సైడ్ సినీ సర్కిల్లో టాక్.
ఇక్కడ సినిమాలు తగ్గడం.. ఆదే సమయంలో బాలీవుడ్ ఆఫర్లు తలుపు తట్టడంతో వాటికి ఓకే చేసింది. అప్పటికే హిందీలో ‘మొహంజొదారో’తో భారీ డిజాస్టర్ చూసిన ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’తో బాలీవుడ్లో మరోసారి లక్ పరీక్షించుకోవాలనుకుంది.
ఈ మూవీ సక్సెస్ ఆమె క్రూషియల్‌గా మారింది. కానీ ఇది కూడా ఆశించిన విజయం ఇవ్వలేకపోయింది. సినిమా ఘోర పరాజయం పొందింది. ఈ మూవీ ప్లాప్ 'బుట్టబొమ్మ'ను దారుణంగా నిరాశ పరిచింది.
అంతేకాదు ఈ మూవీ డిజాస్టర్‌తో హిందీలోనూ ఐరన్ లెగ్ ముద్ర వేసుకుంది. ఇక అప్పటికే రణ్వీర్ సింగ్‌తో సర్కస్ మూవీకి సైన్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇక ఇప్పుడు పూజా ఆశలన్ని 'సర్కస్'పైనే ఉన్నాయి.
దీని తర్వాత పూజ చేతిలో పెద్దగా ఆఫర్స్ లేనట్టు కనిపిస్తుంది. ఆమె చేతిలో తెలుగు ఏ ప్రాజెక్ట్ కూడా లేనట్టు తెలుస్తోంది. దీంతో ఎక్కువ విరామ సమయాన్ని గడుపుతున్న ఈ బ్యూటీ తరచూ వెకేషన్స్‌కు వెళుతుంది.
ఈ మధ్య తెరపై పూజా సందడి తగ్గంది. దీంతో మీడియా ముందుకు కూడా ఈ బ్యూటీ పెద్దగా రావడం లేదు. సోషల్ మీడియాలోనూ పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు మాత్రమే ఫొటోలు షేర్ చేసిన నేను ఉన్నానంటూ పలకిరిస్తుంది.
ఈ క్రమంలో చాలా గ్యాప్ తర్వాత పూజా మీడియా కంట పడింది. తాజాగా పూజా ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనం ఇచ్చింది. జీన్స్, టాప్‌లో క్యూట్ స్మైల్‌తో ఫిదా చేసింది. ప్రస్తుతం పూజ ఎయిర్‌పోర్టు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.