Rakul And Jackky Bhaganani: ముంబైకి చేరుకున్న కొత్త జంట - మీడియాకు స్వీట్స్, గిఫ్ట్స్ పంపిణీ..
Rakul Preet singh and jackky Bhagnani return To munabai: కొత్త జంట ముంబైకి చేరుకుంది. పెళ్లి అనంతరం తొలిసారి వీరి ముంబైలోని జాకీ భగ్నానీ ఇంటికి చేరుకున్నారు. కొత్త జంట రాకతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదీంతో జాకీ భగ్నానీ ఇంటికి మీడియా చేరుకుని కొత్త దంపతులను తమ కెమెరాలో బంధించారు. ఈ సందర్భంగా రకుల్-జాకీలు మీడియాలో స్వీట్స్‌తో పాటు కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాలో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపింది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దంపతులుగా రకుల్-జాకీలను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. కాగా ఫిబ్రవరి 21న హీరోయిన్ రకుల్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీలు వైవాహిక జీవితంలోకి అడుగపెట్టారు.
గోవాలో గ్రాండ్‌గా వీరి పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరిద్దరు ఏడడుగులు వేశారు. దక్షిణ గోవాలో ITC గ్రాండ్లో జరిగిన వీరి వివాహ వేడుకకు శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా, ఆయుష్మాన్, అర్జుణ్ కపూర్, రవీణా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్స్, ప్రముఖులు హాజరయ్యారు.
కాగా ఈ జంట పెళ్లీ పీటలు ఎక్కెవరకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. దాంతో వీరి వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు, వేదికపై ఆసక్తి నెలకొంది. ఇక వివాహ వేడుక అనంతరం రకుల్ పెళ్లి ఫోటోలు షేర్ చేయగా ఇవి క్షణాల్లో వైరల్‌గా మారాయి.
ఆ తర్వాత కొన్ని కొన్ని పెళ్లి ఫొటోలు, వీడియోలను రకుల్ షేర్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో కొద్ది గంటల క్రితం రకుల్ తమ పెళ్లి వీడియో గ్లింప్స్‌ను షేర్ చేసిన సంగతి తెలిందే. నువ్వు, నేను కాదు.. ఇక నుంచి మనం.. అంటూ వీడియో షేర్ చేసింది రకుల్.
దాంట్లో హల్దీ, సంగీత్, మెహందీ, పెళ్లికి సంబంధించి స్పెషల్ మూమెంట్స్ ఉన్నాయి. వాటిని చాలా చక్కగా క్యాప్చర్ చేశారు ఈ వీడియోలో. జాకీ భగ్నానీ కోసం రకుల్ ప్రీత్ సింగ్ తన సోదరులతో కలిసి నడుస్తూ వస్తున్న మూమెంట్ భలే ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు ఆమె అభిమానులు.
ఇక ఈ వీడియోకి ‘బిన్ తెరీ’ పాటను యాడ్ చేశారు. ఆ పాటకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే? రకుల్ ప్రీత్ సింగ్ కోసం జాకీ భగ్నానీ ఆ పాటను స్వయంగా రాసి, కంపోజ్ చేశారు.