Nani Odela 2: దసరా దర్శకుడితో రెండో సినిమా... దసరా రోజున క్లాప్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని
నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇప్పుడు ఈ హీరో దర్శకుడు కలయికలో మరొక సినిమా రూపొందుతోంది. దసరా చిత్రాన్ని నిర్మించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ అధినేత సుధాకర్ చెరుకూరి ఈ తాజా చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. దసరా రోజున పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించి, అధికారికంగా ప్రకటించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదసరా కంటే 100 రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ చూపించే చిత్రాన్ని శ్రీకాంత్ వదిన దర్శకత్వంలో తాను చేయబోతున్నాను అని ఇటీవల నాని చెప్పారు. ఈరోజు ఆ సినిమాకు ఆయన పూజ చేశారు.
నాని కోసం శ్రీకాంత్ ఓదెలా ఈసారి లార్జెర్ దాన్ లైఫ్ స్టోరీ రాశారట. ఆ కథలో క్యారెక్టర్ కోసం నాని తనను తాను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని, ట్రాన్స్ఫర్మేషన్ అందరూ సర్ప్రైజ్ అయ్యేలా ఉంటుందని నిర్మాత తెలిపారు.
నాని కెరీర్ లో ఈ సినిమా భారీ బడ్జెట్ ఫిల్మ్ అవుతుందని, సుధాకర్ చెరుకూరి రాజీ పడకుండా భారీ ఎత్తున చిత్రాన్ని నిర్మించాలని ఫిక్స్ అయ్యారని యూనిట్ వర్గాలు చెప్పాయి. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.