Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ట్రెడిషనల్ లుక్ - పింక్ కలర్ అనార్కలి డ్రెస్‌లో ఫిదా చేస్తున్న 'మరాఠి' బ్యూటీ
Mrunal Thakur Stunning Look: మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకూర్ పింక్ డ్రెస్‌లో తళుక్కున మెరిచింది. తాజాగా ఫ్లోరల్ ప్రింట్ అనార్కలి అవుట్ ఫిట్‌లో ఫిదా చేసింది ఈ భామ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం ఆమె ఫోటోలు నెకటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'సీతరామం' సినిమాతో తెలుగులో యమ క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. తొలి చిత్రంతోనే టాలీవుడ్లో సెన్సేషన్ అయ్యింది.
ఈ సినిమాలో మృణాల్ తన కట్టు, బోట్టుకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక తనదైన నటన.. అందం, అభినయంతో అందరిని దృష్టిని ఆకర్షించింది. సీతారామం క్రేజ్‌తో మృణాల్‌కు తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
ఈ చిత్రంలో తర్వాత నాని సరసన 'హాయ్ నాన్న' చిత్రంలో మెరిసింది. ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే రీసెంట్గా విడుదలైన 'ఫ్యామిలీ స్టార్' మాత్రం అమ్మడికి ఆశించిన విజయం ఇవ్వలేకపోయింది.
ఇందులో మృణాల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే విజయ్ దేవరకొండతో కెమిస్ట్రీ కూడా బాగానే పండిందని ఆడియన్స్ కొందరు అంటుంటే మరికొందరు వీరిద్దరి ఆన్‌స్క్రీన్ రొమాన్స్ పెద్దగా ఆకట్టుకోలేదంటున్నారు.
ఫ్యామిలీ స్టార్‌తో ఈ ఆమ్మడు తెలుగులో తొలి పరాజయం చూసింది. ఇదిలా ఉంటే తరచూ మృణాల్ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుందనే విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ శారీలో తళుక్కున మెరిసింది.
గోల్డ్ అండ్ క్రీం డిజైనర్ చీరకట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. వీటిని 'ఏ రాయల్ ఎఫైర్(a Royal Affair)' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక చీరలో మృణాల్ వయ్యారాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
మరోసారి ట్రెడిషనల్ లుక్‌తో మతిపోగోడుతుంది భయ్యా అంటూ కుర్రకారు ఆమె ఫోటోలపై స్పందిస్తుంది. ప్రస్తుతం మృణాల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.