Alia Bhatt Saree: అంబానీ పెళ్లిలో అందరి కళ్లన్ని అలియా శారీపైనే - 160 ఏళ్ల నాటి చరిత్ర ఉన్న ఈ చీర ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Alia Bhatt Wear 160 Years Old Silk Saree: భారత కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకులు ముగిశాయి. ఈ పెళ్లిలో అలియా-రణ్‌బీర్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముఖేష్ అంబానీ, నితూ అంబానీల చిన్న కుమారుడు ఆకాశ్ అంబానీ, రాధిక మార్చంట్లు జూలై 12న మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లిలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్స్, గ్లోబల్ స్టార్స్ హాజరయ్యారు.
బాలీవుడ్ మొత్తం అంబానీ ప్రతి పెళ్లి వేడుకల్లో కనిపించారు. ఖాన్, కపూర్ హీరోలంతా హాజరయ్యారు. అయితే ఈ పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
అంతా జిగెల్ మనెలా ఎంబ్రాయిడరి, మిర్రర్ వర్క్ హెవీ డిజైనర్ వేర్లో వస్తే.. అలియా మాత్రం సింపుల్‌గా పింక్ కలర్ జెర్రి బార్డర్ పట్టు చీరలో వచ్చింది. రణ్‌బీర్ ట్రెడిషనల్ శర్వాణీలో వచ్చారు. ఈ పెళ్లి సంప్రదాయ దుస్తుల్లో పర్ఫెక్ట్ కపుల్‌గా నిలిచారు రణ్‌బీర్-అలియా.
అయితే అందరి కళ్లు అలియా చీరపైనే పడ్డాయట. సింపుల్ కనిపించే ఈ చీర వెనక పెద్ద స్టోరీనే ఉంది. అంతేకాదు దీని ప్రత్యేకత తెలిసి అంత సర్ప్రైజ్ అవుతున్నారట. చూడటానికి సింపుల్‌గా కనిస్తున్న ఈ చీరలో స్వచ్చమైన బంగారం, వెండితో తయారు చేశారట.
ఈ చీర 160 ఏళ్ల నాటిది. దీనికి డిజైన్ కోసం నిజమైన బంగారం, వెండిని ఉపయోగించారట. 160 ఏళ్ల క్రితం గుజరాత్లో నేసిన ఆశావళి స్వచ్చమైన పట్టుచీర ఇది. దీని తయారిలో 99 శాతం స్వచ్చమైన వెండితో కూడిన జరీ బార్డర్‌తో రూపొందించింది.
ఈ చీరకు రీగల్ లుక్ అందించడానికి సుమారు 6 గ్రాముల బంగారాన్ని ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఇక ఈ చీర ప్రత్యేకత తెలిసి ఆడవాళ్లంతా కంగుతింటున్నారు.