CM Chandrababu: హరేకృష్ణ గోకుల క్షేత్రంలో అనంతశేష స్థాపన - ఆధాత్మిక సేవలో సీఎం చంద్రబాబు, ఫోటోలు చూశారా!
గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్, మంత్రులు నారాయణ, సవిత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధుపండిత్తో సీఎం చంద్రబాబు మాటా మంతీ. హరే కృష్ణ సంస్థ దైవ సేవతో పాటు మానవ సేవను సమానంగా చేస్తోందని ఈ సందర్భంగా సీఎం కొనియాడారు.
హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త పెనుమత్స శ్రీనివాస్ రాజు హరే కృష్ణ సంస్థకు రూ.3 కోట్ల విరాళం ప్రకటించారు. అలాగే, పూర్ టు రిచ్ స్ఫూర్తితో వంద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు చెప్పారు.
హరే కృష్ణ సంస్థ సేవలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కొనియాడారు. మంచి చేసే వారంతూ ముందుకు రావాలని వారికి ఏపీ చిరునామాగా ఉంటుందని అన్నారు. అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్నక్యాంటీన్లను పునఃప్రారంభిస్తున్నామని చెప్పారు.
గర్భాలయంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. వేంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో సీఎం చంద్రబాబు, జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా హోమం నిర్వహించారు.
అనంతశేష స్థాపనలో భాగంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ఆధ్యాత్మికత ద్వారానే మానసిక ఆనందం కలుగుతుందని అన్నారు.
అందరిలోనూ దైవత్వాన్ని పెంపొందించేలా అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ కృషి చేస్తున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవలను కొనసాగించాలని అన్నారు.
పూజల అనంతరం సీఎం చంద్రబాబుకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం హారతి స్వీకరించారు.
హరేకృష్ణ గోకుల క్షేత్రంలో విగ్రహానికి పువ్వుల మాల వేసిన సీఎం చంద్రబాబు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలని పిలుపునిచ్చారు.