Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Anant Ambani Wedding: మహారాణిలా మెరిసిపోయిన రాధికా మర్చెంట్
భారతదేశంలో ఇప్పుడు అందరి దృష్టి అంబానీల ఇంట అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి మీదే ఉంది. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్, రాధికల వివాహం ఘనంగా జరిగింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅత్యంత అందమైన వధువుగా రాధిక అందర్నీ చూపుల్ని ఆకర్షించారు. ఆమె ప్రతి ఈవెంట్ కి వేసుకున్నడిజైనర్ దుస్తులు ఆకట్టుకున్నాయి.
రాధిక అనంత్ అంబానీతో జరుగుతున్న తన వివాహానికి అబు జానీ, సందీప్ ఖోస్లా సంయుక్తంగా రూపొందించిన లెహంగా ధరించారు. అలాగే వంశ పారంపర్యంగా వచ్చే ఆభరణాలు వేసుకున్నారు.
సాధారణంగా సింపుల్ గా ఉండే రాధిక వేడుకల సమయంలో మాత్రం సందర్భానికి తగినట్టు వస్త్రాలు ధరిస్తుంది. ఇక జీవితాంతం గుర్తుండిపోయే పెళ్ళి వేడుకకు ఆమె మరింత అందంగా ముస్తాబయ్యింది.
ఆమె పెళ్ళి దుస్తులను గుజరాతీ సాంప్రదాయం ప్రకారం ఎరుపు తెలుపు మేళవింపులో డిజైన్ చేశారు. దానికి ఐవరీ జర్దోజీ కట్-వర్క్ జోడించారు. డబుల్ దుపట్టా వేసుకున్నారు. మెడలో పచ్చలు పొదిగిన నెక్ లేస్ ధరించారు.
అలాగే గుజరాతీ సంప్రదాయం ప్రకారం ఆమె తలమీద వేసుకున్న కొంగు చాలా సున్నితమైన మెటీరియల్ తో డిజైన్ చేశారు.
మొత్తానికి రాధికా మర్చంట్ తన రాయల్ వెడ్డింగ్ లుక్తో అందరినీ కట్టి పడేసింది.