Megha Akash: కాబోయే భర్తతో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి మేఘా ఆకాష్ - పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం!
Megha Akash Went Rajinikanth Home With Finance Saai Vishnu: హీరోయిన్ మేఘా ఆకాష్ త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. రెండు రోజులు ప్రియుడితో సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని ఫ్యాన్స్‌కి షాకిచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇక అప్పుడే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టింది. అప్పుడే పెళ్లి ఆహ్వాన పత్రికలు కూడా పంచుతుంది. తాజాగా ఈ భామ కాబోయే భర్తతో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను పెళ్లికి ఆహ్వానించింది.
ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ ఇంటికి వెళ్లి ఆయనను పెళ్లికి ఆహ్వానించాను అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.
ఈ సందర్భంగా తలైవాతో కాబోయే భర్తతో కలిసి ఫోటోలు దిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా గురువారం మేఘా ఆకాష్ తన ప్రియుడు సాయి విష్ణును నిశ్చితారం చేసుకుంది.
సైలెంట్‌గా జరిగిన ఈ వేడుకకు కొద్దిమంది సన్నిహితులు, ఇరుకుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. సింపుల్‌గా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు శనివారం ఈ భామ ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.
ఇక మేఘా ఆకాష్ పెళ్లి చేసుకోబోతుందని తెలిసి అంతా షాక్ అయ్యారు. ఆమె నిశ్చితార్థం ఫోటోలు చూసి నెటిజన్లు సర్ప్రైజ్ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.