Prisha Singh: అల్లు హీరోతో నటించిన ఈ అందాల భామ ఎవరు, ఇంతకు ముందు ఏం చేసిందో తెలుసా?

Know About Buddy movie actress Prisha Singh: ప్రిషా సింగ్... ఈ అందాల భామ పేరు. అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా 'బడ్డీ'లో నటించింది. అసలు ఈ అమ్మాయి నేపథ్యం ఏమిటి? ఇంతకు ముందు ఏం చేసింది? వంటి వివరాల్లోకి వెళితే...
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ప్రిషా సింగ్ రాజస్థాన్ అమ్మాయి. సినిమాలపై ఆసక్తితో మొదట మోడలింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు. హిందీలో ఓ మ్యూజిక్ వీడియో 'జరూరీ నహీ'లో ఆమె నటించారు. ఆ పాట ఆమెకు గుర్తింపు తెచ్చింది.

అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో రూపొందిన 'గులాబో సితాబో'లోనూ ప్రిషా సింగ్ నటించారు. ఆ సినిమాలో బేగమ్ బర్త్ డే పార్టీలో స్పెషల్ గెస్ట్ రోల్ చేశారు.
నిఖిల్ 'స్పై' సినిమాతో ప్రిషా సింగ్ తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఆ మూవీలో ఆమె హీరోయిన్ కాదు. కానీ, కీ రోల్ చేశారు. అందులో జిష్షుసేన్ గుప్తా కుమార్తె పాత్రలో నటించారు.
కథానాయికగా ప్రిషా సింగ్ తొలి సినిమా 'బడ్డీ'. ఇందులో ఆవిడ అల్లు శిరీష్ జోడీగా నటించారు. ఇటీవల ప్రచార కార్యక్రమాల్లో సందడి చేశారు. ట్రైలర్ లో ఆమె అప్పియరెన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.
Prisha Singh Role In Buddy Movie: 'బడ్డీ' సినిమాలో ఎయిర్ హోస్టెస్ రోల్ చేశారు ప్రిషా సింగ్. అందుకోసం కొంత మంది ఎయిర్ హోస్టెస్ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేశానని ఆవిడ చెబుతున్నారు.
తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నట్టు ప్రిషా సింగ్ తెలిపారు. సౌత్ ఇండియన్ లుక్స్, మోడ్రన్ డ్రస్ లలో ఆవిడ చేసిన ఫోటోషూట్స్ వైరల్ అవుతున్నాయి.